తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త వివాదం..సరిహద్దులు క్లోజ్ చేసి తెలంగాణ
తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త వివాదం రాజుకుంది..ఇప్పటి వరకు విభజన సమస్యలతో పాటు సాంకేతిక సమస్యలతో రెండు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతుండగా తాజాగా ధాన్యం కొనుగోలు వివాదం రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో చిచ్చు రేపుతుంది. తెలంగాణలో యాసంగిలో పండే వరిని కేంద్రం ప్రభుత్వం కొనాలని కమలం పార్టీతో గల్లీ నుంచి ఢిల్లీ దాకా టీఆర్ఎస్ నిరసనలు చేశాయి..కేంద్రం దిగి రాకపోడంతో యాసంగి ధాన్యం మొత్తం తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు..దీంతో రాష్ట్రంలో పండిన పంటను మద్దతు ధరకు కొనేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు..ఈ నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల నుంచి తెలంగాణకు వరి ధాన్యం వస్తే..తెలంగాణ రైతులకు నష్టం కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది..సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం తెలంగాణలోకి రాకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.దీంతో ఏపీ సరిహద్దుల్లో తెలంగాణ చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది..
ధాన్యంతో తెలంగాణలో వస్తున్న గూడ్స్ లారీలను అధికారుల సరిహద్దుల్లో అపుతున్నారు..దీంతో బోర్డర్స్ లో టెన్షన్ వాతావరం నెలకొంది…కరోనా సమయంలో అంబులెన్స్‌లు, బస్సులు లాంటివి రాకుండా ప్రభుత్వం చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. తాజాగా ధాన్యం వాహనాలు రాష్ట్రంలోకి రాకుండా ఈ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.ఏపీ నుంచి తెలంగాణలోకి వచ్చే అన్ని దారుల్లోనూ చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది..చాలా ఏళ్లుగా ఏపీ రైతులు తెలంగాణలో ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యం అమ్ముతుంటారు..ఇప్పుడు ఏపీ రైతులు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంతో ఇబ్బందులు పడుతున్నారు..ప్రభుత్వంతో సంభందం లేకుండా మిల్లర్లకు అమ్ముకోవడానికి కష్టాలు పడుతున్నారు..ఇప్పుడు తెలంగాణ మిల్లర్లు కూడా తెలంగాణ రైతుల వద్ద నుంచే ధాన్యం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నల్గొండ లాంటి ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో రైస్ మిల్లులకు ఏపీ నుంచి అధిక మొత్తంలో ధాన్యం వస్తుంటుంది..ఈ సారి అలాంటి అవకాశం లేకుండపోతుంది.