నెట్ ఫ్లిక్స్ కు ఊహించని దెబ్బ…
నెట్ ఫ్లిక్స్ కు యూజర్లు ఊహించని షాక్ ఇచ్చారు. దీంతో బుధవారం రోజున నెట్ ఫ్లిక్స్ షేర్లు 39 శాతం మేర పడిపోయి 212.51 డాలర్ల కు చేరింది. దీంతో ఈ స్ట్రీమింగ్ మార్కెట్ విలువ 60 బులియన్ డాలర్ల మేర క్షిణించింది. నెట్ ఫ్లిక్స్ సంస్థ ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు ఈ స్థాయిలో మార్కెట్ విలువ పడిపోవడం ఇదే మొదటిసారి. జనవరి నుంచి మార్చి వరకు త్రైమాసికంలో సుమారు రెండు లక్షల మంది యూజర్లను కోల్పోయింది. ఇది నెట్ ఫ్లిక్స్ కు అతి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. అయితే భారత్ తో పాటు మరికొన్ని ఆసియా దేశాల్లో మాత్రం నెట్ ఫ్లిక్స్ దే హవా అని తెలుస్తోంది. ఆసియా-ఫసిఫిక్ రీజియన్ లో పది లక్షల సబ్ స్క్రైబర్స్ పెరిగారు.
ఇక ఇదిలా ఉంటే, ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా రష్యా నుంచి తప్పుకోవాలని నిర్ణయించడంతో ఏప్రిల్ నుంచి జూన్ వరకు మరో 20 లక్షల మంది యూజర్లను కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ కంపెనీ లో పెట్టుబడులు పెట్టిన షేర్ హోల్డర్లు ఆందోళన చెందుతున్నారు. నాలుగు నెలల కాలంలో సుమారు 150 బిలియన్ మేర సంపద ఆవిరయ్యింది.