న్యూయార్క్ లో కాల్పులు..భారీగా పేలుడు పరికరాలు స్వాధీనం
న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ సబ్‌వే స్టేషన్‌లో ఓ వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో దాదాపు ఆరుగురు మృతిచెందినట్టు ప్రకటించారు అధికారులు. ఈరోజు ఉదయం ఎనిమిదిన్నర సమయంలో ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తోంది. కాల్పులు జరపడానికి ముందు… సన్‌సెట్ పార్క్‌లోని 36వ వీధిలో… ఒక పరికరాన్ని విసిరినట్టు గుర్తించారు. సంఘటనా స్థలిలో భారీగా పేలుడు పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కాల్పుల్లో చాలా మందికి తీవ్ర గాయాలయినట్టు తెలుస్తోంది.
కాల్పులు జరిపిన తర్వాత దుండగుడు పారిపోయినట్టు అధికారులు చెప్తున్నారు. దాడి చేసిన వారిని పట్టుకోవడానికి హెలికాఫ్టర్ స్క్వాడ్ తో గాలిస్తున్నారు న్యూయార్క్ పోలీసులు. న్యూయార్క్ లో హై అలెర్ట్ ప్రకటించిన అధికారులు స్థానిక మెట్రో స్టేషన్లు,స్కూళ్లు మూసివేశారు. నిందితుడు నిర్మాణ రంగ కార్మికుడిలా డ్రెస్ చేసుకుని ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గ్యాస్ మాస్క్ ధరించి ఒక్క సారిగా స్మోక్ గ్రానైడ్ బాంబులు విసిరినట్లు తెలుస్తుంది. అధికారిక పర్యటనలు రద్దు చేసుకున్న ప్రెసిడెంట్ బైడెన్ వైట్ హౌస్ లో కాల్పుల ఘటన పై అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.