Meta Layoff Continues: మరో 10 వేల మందికి ఉద్వాసన
Meta Layoff Continues: ప్రపంచంలో లేఆఫ్ పర్వం కొనసాగుతోంది. ఆర్థిక మాంద్యం దెబ్బకు ఇప్పటికే లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలు వరసగా లేఆఫ్‌లు ప్రకటిస్తున్నాయి. తాజాగా మెటా సంస్థ మరోమారు ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈసారి ఏకంగా 10 వేల మందికి లేఆఫ్‌లు ఇస్తున్నట్లు ఇచ్చింది. సంస్థ భారం తగ్గించుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేసింది. సంస్థ వ్యయాన్ని 5 బిలియన్ డాలర్ల మేర తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. నాలుగు నెలల క్రితం 11 వేల మందిని తొలగించిన ఇప్పుడు మరో 10 వేల మందికి ఉద్వాసన పలికింది.
అంతేకాదు, మెటా సంస్థ ఈ ఏడాది 5 వేల మందిని రిక్రూట్ చేసుకోవాల్సి ఉన్నా, ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం లేదని పక్కన పెట్టేసినట్లు మెటా సీఈవో మార్క్ జూకర్‌బెర్గ్ తెలియజేశాడు. తరుముకొస్తున్న ఆర్థిక మాంద్యం, పెరుగుతున్న ద్రవ్యోల్భణం కారణంగా ఉద్యోగులను తొలగిస్తున్నారు. గతేడాది అక్టోబర్‌లో లేఆఫ్‌ల పర్వం ప్రారంభమైంది. ఇప్పటి వరకు రెండు లక్షలకు పైగా టెకీలు ఉద్యోగాలు కోల్పోయారు. రాబోయే రోజుల్లో మరికొంత మందిని తొలగించే అవకాశాలు ఉన్నట్లు టెకీ సంస్థలు ప్రకటించాయి. ప్రాధాన్యత లేని ప్రాజెక్టులను పక్కన పెడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులతోనే ప్రాజెక్టులు పూర్తిచేయాలని, ఉద్యోగుల టాలెంట్‌ను సమర్థవంతంగా వినియోగించుకోవాలని మెటా సంస్థ తెలియజేసింది.