అచార్య…ఎలా ఉందంటే…
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌లు కలిసి నటించిన ఆచార్య సినిమా ఎట్టకేలకు ఈరోజు రిలీజ్ అయింది. వరస హిట్స్ అందించిన కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఓవర్సీస్‌తో పాటు అనేక ప్రాంతాల్లో ప్రివ్యూ షోలు పడటంతో చూసిన అభిమానులు, ప్రేక్షకులు సినిమాపై తమ అభిప్రాయాలను మైక్రోబ్లాగ్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. మొదటి నుంచి ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే సాంగ్స్, ట్రైలర్ ఉండటంతో అంచనాలు మరింతగా పెరిగాయి. మరి ఈ మెగా ఆచార్య ఆ అంచనాలను అందుకున్నారా? లేదా? అభిమానులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
ఫస్ట్ ఆఫ్ డీసెంట్‌గా ఉందని, సెకండాఫ్‌లోని చివరి 40 నిమిషాలు మెగా అభిమానుల కోసమే అన్నట్టుగా సినిమా ఉందని, ఇక మణిశర్మ బీజీఎం సినిమాకు ప్రాణం పోసిందని అభిమానులు ట్విట్టర్‌ద్వారా అభిప్రాయాలను తెలిపారు. ఇక క్లైమాక్స్ ఎమోషన్ సీన్స్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతాయని, హిందూమతం గురించి ఇచ్చిన సందేశం ప్రతి ఒక్కరికీ తప్పకుండా నచ్చుతుందని ట్వీట్ చేస్తున్నారు. సెకండాఫ్‌లో మెగస్టార్ ఫైట్స్, డ్యాన్స్‌తో తన విశ్వరూపాన్ని ప్రదర్శించారని, అచార్యకు మెగాస్టార్ ఫర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారని మెగా అభిమానులు ట్వీట్ చేస్తున్నారు.