ఈ ఏడాది సూర్య, చంద్రగ్రహణాలు వరసగా రావడం విశేషం. సూర్యగ్రహణం అక్టోబర్ 25 వ తేదీన వస్తే, చంద్రగ్రహణం నవంబర్8 వ తేదీన వచ్చింది. సూర్యగ్రహణం సాయంత్రం నుంచి ప్రారంభమైతే, చంద్రగ్రహణం మధ్యాహ్నం సమయంలో వచ్చింది. సూర్యగ్రహణం కారణంగా దీపావళిని ఒక రోజు ముందుగానే జరుపుకున్నారు.
Lunar Eclipse: ఈ ఏడాది సూర్య, చంద్రగ్రహణాలు వరసగా రావడం విశేషం. సూర్యగ్రహణం అక్టోబర్ 25 వ తేదీన వస్తే, చంద్రగ్రహణం నవంబర్8 వ తేదీన వచ్చింది. సూర్యగ్రహణం సాయంత్రం నుంచి ప్రారంభమైతే, చంద్రగ్రహణం మధ్యాహ్నం సమయంలో వచ్చింది. సూర్యగ్రహణం కారణంగా దీపావళిని ఒక రోజు ముందుగానే జరుపుకున్నారు. ఇక, చంద్రగ్రహణం కారణంగా కార్తీక పౌర్ణమి కూడా ఒకరోజు ముందుగానే జరుపుకోవలసి వచ్చింది. చంద్రగ్రహణం ఈరోజు మధ్యాహ్నం 2:40 గంటలకు ప్రారంభమయ్యి సాయంత్రం 6:19 గంటల వరకు ఉన్నది. చంద్రగ్రహణం రోజున కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణసమయంలో ఆహారం వండటం, తినడం చేయకూడదు.
పూజలు చేయకూడదు. పూజగది తలుపులు మూసివేయాలి. గ్రహణ సమయంలో నిద్రపోకూడదని జోతిష్యశాస్త్రం తెలుపుతున్నది. గ్రహణం రోజున గర్భిణులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రహణం సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చెట్లను ముట్టుకోకుండా ఉండాలి. గ్రహణం కంటే ముందే ఆహారం తినేయాలి. ఒకవేళ ఆహార పదార్ధాలు మిగిలి ఉంటే వాటిలో తులసిఆకులు వేయాలి. గ్రహణం తరువాత ఇంటిని పసుపునీటితో శుద్ది చేసుకోవాలి.