అక్కడ రూపాయికే పెట్రోల్…
దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు వంద దాటేసింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, ఏప్రిల్ 14న బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మహారాష్ట్రలోని సోలాపూర్‌లోని ఓ పెట్రోల్ బంక్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. రూపాయికే లీటర్ పెట్రోల్‌ను ఇస్తామని ముందుకు వచ్చింది. అయితే, మొదటగా వచ్చే 5 వందల మందికి మాత్రమే ఈ ఆఫర్ ఇస్తున్నట్టు ప్రకటించింది. దీంతో పెద్ద సంఖ్యలో వాహనదారులు క్యూ కట్టారు. వీరిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు నానాపాట్లు పడాల్సి వచ్చింది. పెరుగుతున్న ధరలతో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చెప్పేందుకే తాము ఈ ఆఫర్ ప్రకటించామని పెట్రోల్ బంక్ యాజమాన్యం తెలియజేసింది.