జార్ఖండ్: త్రికూట పర్వతాల్లో ముగిసిన రెస్క్యూ ఆపరేషన్
జార్ఖండ్ తీగల మార్గం ప్రమాదం ఆపరేషన్ ముగిసింది. సహాయక చర్యల్లో…తాజాగా మరో మహిళ ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య…నాలుగుకి చేరింది. 40 మందిని సురక్షితంగా రక్షించాయ్ ప్రత్యేక బృందాలు. జార్ఖండ్ త్రికూట పర్వతాల్లోని… తీగల మార్గంలో జరిగిన ప్రమాదంలో.. మరో అపశ్రుతి చోటుచేసుకుంది. సహాయచర్యల్లో భాగంగా తాడు తెగడంతో.. ఓ మహిళ కిందిపడి ప్రాణాలు కోల్పోయింది. దీంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ప్రమాదం కారణంగా ఇద్దరు మృతి చెందగా…సహాయ చర్యల్లో మరో ఇద్దరు చనిపోయారు. రోప్‌వే కేబుల్ కార్లలో చిక్కుకుపోయిన వారిని…సురక్షితంగా తీసుకువచ్చే ప్రక్రియ ముగిసింది.
దాదాపు 45 గంటల పాటు శ్రమించి.. బాధితుల్ని సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. వైమానిక దళం, ఆర్మీ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కలిసి చేపట్టిన…ఆపరేషన్‌లో 40 మందిని రక్షించారు. ఆపరేషన్‌కు సంబంధించిన దృశ్యాలను భారత వైమానిక దళం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రెండ్రోజుల క్రితం టూరిస్టులు… 766 మీటర్ల పొడవైన వర్టికల్ రోప్‌వేలో విహరిస్తుండగా…రెండు కేబుల్ కార్లు ఢీకొన్నాయి. తర్వాత సహాయచర్యల సమయంలో…ఒక వ్యక్తి హెలికాఫ్టర్ నుంచి జారి, కిందపడి చనిపోయారు. దట్టమైన అటవీ, కొండ ప్రాంతం కావడంతో..వాయు మార్గంలో సహయక చర్యలు కొనసాగించాల్సి వచ్చింది. అక్కడ చిక్కుకున్నవారికి డ్రోన్ల ద్వారా ఆహారం, నీళ్లు అందించారు. ఇవాళ్టీతో ఆపరేషన్ ముగిసింది. దీనిపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు జార్ఖండ్ ప్రభుత్వం ఆదేశించింది.