వాలంటీర్లకు షాకిచ్చిన జగన్..కొత్త రూల్స్ తో ఉద్యోగులకు కష్టాలు
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది.వాలంటీర్లు తప్పని సరిగా రోజుకు మూడు సార్లు హాజరును తప్పని సరిచేసింది..ఈ మేరకు జీవో విడుదల చేసింది..ఇందుకోసం ప్రభుత్వం ఒక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది..ఈ కొత్త విధానం ఇవాళ్టి నుంచి అమల్లోకి రానుంది..ఉద్యోగులు తప్పనిసరిగా తమ స్మార్ట్ ఫోన్ లో ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని రోజుకు మూడు సార్లు హాజరు వేసుకోవాలని జీవోలో ప్రభుత్వం పేర్కొంది.
ఉదయం 10 గంటలలోపు, మధ్యాహ్నం 3 కు, సాయంత్రం 5 గంటలకు హాజరు తప్పనిసరి అని జీవో పేర్కొంది.సొంత ఫోన్లు లేని వారు సచివాలయాలకు ప్రభుత్వం కేటాయించిన స్మార్ట్ ఫోన్లు ఉపయోగించుకోవాలి ప్రభుత్వం తెలిపింది.దీంతో గ్రామా సచివాలయ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు..ప్రతుభ్వం తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడుతున్నారు..ప్రభుత్వంలో ఏ శాఖలో లేని నిబంధనలు తమకే ఎందుకు అని వాలంటీర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్దిదారుల ఇంటికే చేరడానికి ఈ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతోంది..గ్రామాల్లో వార్డ్ స్థాయిలో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి..వారి సమస్యలను పరిష్కారానికి వాలంటీర్ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుందని సీఎం జగన్ పలు సందర్భాల్లో కితాబిచ్చారు..2019 విధుల్లో చేరిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ 2021 అక్టోబర్ లో ఖరారు చేయాలి. కాని శాఖా పరమైన పరీక్షల్లో చాలా మంది ఉత్తీర్ణులు కాలేదన్న ఉద్దేశ్యంతో.. 2022 జూన్ లో అందరి ప్రొబేషన్ ఒకేసారి ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. ఈ నేపథ్యంలో ఈ కొత్త రూల్ తీసుకువచ్చారు.