హార్దిక్ కెప్టెన్ ఇన్నింగ్స్..సన్‌రైజర్స్ ముందు టఫ్ టార్గెట్…!
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా(50),అభినవ్ మనోహార్(35), వేడ్(19) పరుగులతో రాణించారు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఇన్నింగ్స్‌కు తోడు చివర్లో అభినవ్ మనోహర్ మెరుపులు మెరిపించడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు గుజరాత్ టైటాన్స్ 163 పరుగుల టఫ్ టార్గెట్ ఉంచింది.
ఇక ఎస్‌ఆర్ హెచ్ బౌలర్లలో నటరాజన్, భువనేశ్వర్ కుమార్ చెరో రెండు వికెట్లు సాధించగా.. జానెసన్, ఉమ్రాన్ మాలిక్ చెరో వికెట్ సాధించారు. అయితే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బౌలర్లు ఏకంగా 22 పరుగులు ఏక్స్‌ట్రాల రూపంలో ఇచ్చారు. అంతేకాకుండా అభినవ్ మనోహర్ ఇచ్చిన క్యాచ్‌లను సన్‌రైజర్స్ ఫీల్డర్లు నెలపాలు చేయడంతో అతనికి ఏకంగా 3 సార్లు లైఫ్ లభించింది.