హనుమాన్ జయంతి వేడుకలు…ఆలయాలకు పోటెత్తిన భక్తులు…
చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా అంజన్న ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకొని అంజన్నను దర్శించుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రముఖ దేవాలయమైన కొండగట్టు ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. ఉదయం 4 గంటల నుంచే క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. హనుమాన్ దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
ఇక హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో శోభాయాత్రను నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా శోభాయాత్రను నిర్వహించలేదు. కాగా, ఇప్పుడు ఆంక్షలు ఎత్తివేయడంతో పెద్ద ఎత్తున ఈ శోభయాత్రను నిర్వహిస్తున్నారు. దీంతో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శోభాయాత్ర జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను డైవర్ట్ చేయనున్నారు.