నేడు జీహెచ్ఎంసీ కీలక బడ్జెట్ సమావేశం…
ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కు సంబంధించి బడ్జెట్ సమావేశం కాబోతున్నది. ఈరోజు ఉదయం 10 గంటలకు బల్డియా ప్రధాన కార్యాలయంలో ఈ బడ్జెట్ సమావేశం జరుగుతున్నది. 2022-23 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సంవత్సరానికి రూ. 6150 కోట్ల బడ్జెట్‌కు ఇప్పటికే స్టాండింగ్ కమిటీ ఆమోదముద్ర వేసింది. రెవెన్యూ ఆదాయం రూ. 3,434 కోట్లు కాగా, రెవెన్యూ ఖర్చు 3,350 కోట్లుగా ఉన్నట్టు జీహెచ్ఎంసీ తెలియజేసింది. ఇక, నగరంలోని తాగునీరు కలుషితం, చిన్న కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులపై ఈ బడ్జెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. గత కౌన్సిల్ సమావేశంలో కార్పోరేటర్ల నుంచి సుమారు 410 ప్రశ్నలు రాగా, ఇందులో 24 ప్రశ్నలకే సర్వసభ్య సమావేశంలో చర్చించేందుకు ఎంపిక చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రతిపక్షాల నుంచి ఆందోళనలు ఎదురయ్యే అవకాశాలు ఉండటంతో బల్దియా వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.