Airpods Manufacturing in Hyderabad: హైదరాబాద్‌లో ఎయిర్ పాడ్ తయారీ కేంద్రం
Airpods Manufacturing in Hyderabad: ఇటీవలే తెలంగాణ ప్రభుత్వంతో తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో ఫాక్స్ కాన్ సంస్థ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నది. త్వరలోనే ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్లాంట్‌లో ఎయిర్ పాడ్‌లను తయారు చేయనున్నారు. 1600 కోట్ల నిధులను ఈ ప్లాంట్ కోసం వెచ్చించనున్నారు. 20 కోట్ల డాలర్లను పెట్టుబడులుగా పెట్టనున్నారు. ప్రస్తుతం చైనాలో ఫాక్స్‌కాన్ సంస్థ ఎయిర్ పాడ్‌లను తయారు చేస్తున్నది.
చైనా, తైవాన్ దేశాల మధ్య ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఫాక్స్ కాన్ సంస్థ ఆ దేశం నుండి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. చైనా నుండి బయటకు వచ్చి భారత్‌లో ఈ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే హైదరాబాద్ నగరంలో ఫాక్స్‌కాన్ సంస్థ తన ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమౌతున్నది. చైనా తరువాత భారత్ రెండో అతిపెద్ద మార్కెట్ కావడంతో చైనాను వ్యతిరేకిస్తున్న పలు కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువస్తున్నాయి. ఇప్పటి ఐఫోన్ తయారీ భారత్ కేంద్రంగా జరుగుతున్నది. మరికొన్ని కంపెనీలు చైనా నుండి బయటకు వచ్చి ఇండియాలో ప్లాంట్‌లను నెలకొల్పాలని చూస్తుండటం విశేషం.