జగన్ పై ఉండవల్లి సంచలన కామెంట్స్..సీఎం శుక్రుడంటూ..
సీఎం జగన్‌పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ బిజినెస్ మాన్ అని..పెద్ద గేబ్లింగ్ ఆడుతున్నారని ఉండవల్లి అన్నారు. రాష్ట్రంపై శుక్రుడు వక్రంగా చూస్తున్నాడని..శుక్రుడు ఎవరో నన్ను అడగొద్దన్నారు..తెలంగాణ రిచ్ స్టేట్..ఏపీ పూర్ స్టేట్ గా తయారైందని మండిపడ్డారు. విద్యుత్ పై జగన్ రాష్ట్రంలో క్విడ్‌ప్రోకో అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
విద్యుత్ పై జగన్‌కి ముందు చూపు లేదని తప్పుబట్టారు..గతంలో రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉండేదని ఉండవల్లి అరుణ్‌కుమార్ తెలిపారు..ఇప్పుడు విద్యుత్ కష్టాలు నుంచి రాష్ట్రం బయట పడడానికి ఎన్ని యుగాలు పడుతుందో తెలియదన్నారు.. తెలంగాణలో పవర్ కట్ లేదని, ఏపీలో కరెంట్ కట్ విపరీతంగా ఉందని మండిపడ్డారు. సంక్షేమ పథకాల కోసం జగన్ ఎంతకాలం బటన్స్ నొక్కి డబ్బులు ఇవ్వగలడో ఇప్పుడే చెప్పలేమన్నారు. ప్రధాని మోడీకి జగన్ ఇచ్చిన వినతిపత్రంలో ప్రత్యేక హోదా అంశం లేదని ఉండవల్లి అరుణ్‌కుమార్ వెల్లడించారు..కాంగ్రెస్ తో సహా అన్ని పార్టీలు మోడీ కన్నుల్లోనే నడుస్తున్నాయని ఉండవల్లి అరుణ్‌కుమార్ హాట్ కామెంట్స్ చేశారు.