ఎమ్మెల్యే పదవికి మాజీ మంత్రి సుచరిత రాజీనామా..అదేబాటలో బాలినేని ?
వైసీపీలో అసంతృప్తి సెగలు భగ్గుమంటున్నాయి. మాజీలైన మంత్రులు ఓ పక్క..మంత్రి వర్గంలో స్థానం ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యేలు మరో పక్క రాజీనామాలకు సిద్దపడుతున్నారు. మాజీ హోం మంత్రి మేకపాటి సుచరిత స్పీకర్ ఫార్మాట్ లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. తనను మంత్రి వర్గం నుంచి తొలగించడం పై కనీసం సమాచారం లేదంటుంది. మరోపక్క సుచరిత ఇంటి వద్ద అభిమానుల ఆందోళన చేస్తున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు రాజీనామాలకు సిద్దపడ్డారు.
సీఎం జగన్ సమీప బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి నివాసం వద్ద హైటెన్షన్ నెలకొంది. సీఎం జగన్ నిర్ణయంతో ప్రకాశం జిల్లా వైసీపీ నేతలు స్థానికంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఛైర్మన్‌ల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు బాలినేని నివాసానికి నాయకులు చేరుకుంటున్నారు. మంత్రి పదవి పోగొట్టుకున్న వారు కూడా ఫోన్‌లో బాలినేనితో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రెండు సార్లు చర్చలు జరిపినా బాలినేని మెత్తపడలేదు. ఆయన కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. మంత్రివర్గ పున్వ్యవస్థీకరణలో మంత్రి పదవి దక్కక పోవటంతో అసంతృప్తితో గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కూడా రాజీనామాకి సిద్దమవుతున్నారు. వైశ్య సామాజిక వర్గానికి చెందిన రాంబాబు మంత్రి పదవి వస్తుందన్న ధీమాతో ఉన్నారు.
విశాఖ జిల్లాలో మంత్రి పదవి దక్కలేదన్న ఆవేదనలో చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ ఉన్నారు. నిన్న సాయంత్రం వరకు కూడా నా పేరు పరిశీలనలో ఉందని హైకమాండ్ పెద్దలు చెప్పారు. ఏ ఈక్వేషన్లు తేడా వచ్చాయో కానీ ఆఖరి నిముషంలో మార్పులు జరిగాయంటూ ఆవేదనలో ఉన్నారు. నిన్నటి నుంచి నా ఫోన్ స్విచ్చాఫ్ లో ఉండటంతో నియోజకవర్గంలో కార్యకర్తలు రోడ్డెక్కారు…కృష్ణ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో వైసీపీ ఎమ్మెల్యే ఉదయభాను అనుచరులు అడుగడుగునా హల్ చల్ చేస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారి పై బైక్ కి కార్యకర్తలు పెట్రోల్ పోసి నిప్పు అంటించారు.