నేడు భారత్ కు యూకే ప్రధాని… వీటిపై చర్చించే అవకాశం…
ఈరోజు యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్ కు రానున్నారు. భారత్ లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు యూకే ప్రధాని. లండన్ నుంచి నేరుగా అహ్మదాబాద్ చేరుకుని తర్వాత రోజు ఢిల్లీలో ప్రధాని మోడీతో విస్తృత చర్చలు జరుపనున్నారు. ఇరు దేశాలు ద్వైపాక్షిక- సైనిక, వాణిజ్య సంబంధాల గురించి చర్చించనున్నాయి. అహ్మదాబాద్ లో ప్రధాని బోరిస్ జాన్సన్ కు స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రధాని బోరిస్ పర్యటనలో ప్రధానంగా సైనిక,వాణిజ్య సంబంధాలపైన, ఇండో పసిఫిక్ రీజియన్ పైన చర్చించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా, రక్షణ రంగంలో ఇండియాలో ఆయుధాల ఉత్పత్తి, సాంకేతిక బదిలీ వంటి వాటిపై కూడా చర్చలు జరుపనున్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం పై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇంతకుముందు పీఎం జాన్సన్ భారత్ పర్యటనకు వచ్చేందుకు ప్రయత్నించినా కోవిడ్ కారణంగా పర్యటన రద్దు అయింది. కరోనా ప్రభావం తగ్గడంతో జాన్సన్ భారత్‌లో పర్యటిస్తున్నారు.