IPL: ముంబై ఖాతాలో మరో పరాజయం
చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన హోరాహోరి మ్యాచ్ లో ఆఖరి బంతికి ఫోర్ కొట్టిన ధోని చెన్నైకి ఘన విజయాన్ని అందించాడు. వరుసగా 7 పరాజయాలతో ముంబై ఐపీఎల్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే ఆదిలోనే వికెట్లు కోల్పోయినప్పటికీ.. తరువాత రాయుడు, ఊతప్ప ఇన్నింగ్స్‌తో గాడిలో పడింది.ఆఖర్లో ధోని(28) పరుగులతో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు..చివరి ఓవర్ లో 17 పరుగులు సాధించాల్సిన చెన్నైని ధోని సూపర్ ఇన్నింగ్స్ తో విజయ తీరాలకు చేర్చాడు.ఇక ముంబై బౌలర్లలో డానియల్ సామ్స్ నాలుగు వికెట్లు సాధించగా.. జయదేవ్ ఉనద్కత్ రెండు, మెరిడిత్ ఒక వికెట్ సాధించాడు.
అంతకుముందు ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన మంబై ఇండియన్స్‌ను తిలక్ వర్మ(51), సూర్యకుమార్ యాదవ్(32) రాణించడంతో ఆ మాత్రం స్కోర్ సాధించగలిగింది. ఎనిమిది డకౌట్లతో రోహిత్ శర్మ ఐపీఎల్ లో తన పేరిట ఓ చెత్తరికార్డ్ నమోదు చేసుకున్నాడు