నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నాలు…
నేడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గ కేంద్రాల్లో ధర్నాలు చేపట్టబోతుంది. రాష్ట్రంలో ధరల పెరుగుదలకు నిరసనగా, యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలనే ప్రధానమైన డిమాండ్లతో అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు చేయబోతున్నారు. మూసేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే తెరిపించి రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరలకు కోనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. రైతులకు మద్దతుగా దర్నాలు, దీక్షలు చేపడుతున్నామని, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేవరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద, ఎర్రగడ్డ చౌరస్తాలోనూ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లో జరిగే ధర్నా కార్యక్రమంలో కీలక నాయకులు పాల్గొననున్నారని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.