నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్… రేపటి నుంచి వారంపాటు…
ఈరోజు సీఎం కేసీఅర్ యాదాద్రిలో పర్యటించనున్నారు. గత నెలలో యాదాద్రి ఆలయం ప్రారంభించిన తరువాత తొలిసారి సీఎం యాదాద్రికి వెళ్తున్నారు. అక్కడ శివాలయంలో జరిగే ఉద్ఘాటన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యమం తరువాత సీఎం కేసీఆర్ రేపటి నుంచి వరసగా వారం రోజులపాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మంగళవారం రోజున నగరంలోని మూడు ప్రాంతాల్లో రూ.2679 కోట్ల రూపాయలతో నిర్మించనున్న మూడు ఆసుపత్రులకు సీఎం కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు.
అల్వాల్ లో 28 ఎకరాల విస్తీర్ణంలో 13 అంతస్తుల ఆసుపత్రి భవనాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం రూ. 897 కోట్లు కేటాయించనున్నారు. ఇక, ఎల్బీనగర్ లో 21 ఎకరాల విస్తీర్ణంలో 15 అంతస్తుల ఆసుపత్రి కోసం రూ 900 కోట్లు, సనత్ నగర్ లో 15 ఎకరాల విస్తీర్ణంలో 17 అంతస్తుల ఆసుపత్రి కోసం రూ.882 కోట్లు ఖర్చు చేయనున్నారు. టిమ్స్ పేరుతో ప్రభుత్వం నిర్మించే ఈ ఆసుపత్రులకు రేపు సీఎం కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. ఈనెల 27న మాదాపూర్ లో జరిగే పార్టీ ప్లీనరీ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ ప్లీనరీలో కేంద్రానికి వ్యతిరేకంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈనెల 29న ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం నిర్వహించే ఇఫ్తార్ విందులో పాల్గొంటారు.