ఇళయరాజా వివాదాస్పద వ్యాఖ్యలు… మోడీని చూసి అంబేద్కర్ గర్వపడతారు…
దేశంలో ప్రముఖ సంగీత దర్శకుల్లో ఒకరైన ఇళయరాజా ఇటీవలే ఓ పుస్తకానికి ముందుమాట రాశారు. ఆ పుస్తకంలో రాసిని వ్యాఖ్యలు ఇప్పుడు వివాదంగా మారాయి. బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ సంస్థ అంబేద్కర్ అండ్ మోడీ రీఫార్మర్స్ ఐడియాస్, పెర్పార్మెర్స్ ఇంప్లిమెంటేషన్ అనే పుస్తకాన్ని ప్రచురించింది. ఈ పుస్తకానికి ఇళయరాజా ముందుమాట రాశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ప్రధాని మోడీ మధ్య ఆకట్టుకునే సామాన్యమైన అంశాలు ఉన్నాయని, సామాజికంగా బలహీన వర్గాల ప్రజలు ఎదుర్కొనే అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించారని పుస్తకంలో పేర్కొన్నారు.
దేశం కోసం పెద్ద పెద్ద కలలు కన్నారని, భేటీ బచావో, బేటీ పడావో, ట్రిపుల్ తలాక్ చట్టం వంటి వాటిని అమలు చేసిన మోడీని చూసి అంబేద్కర్ గర్వపడతారని ముందుమాటలో పేర్కొన్నారు. ఇళయరాజా రాసిన ఈ వ్యాఖ్యలపై డీఎంకే ఎంపీ టీకేఎస్ ఎలంగొవాన్ తీవ్రంగా విమర్శించారు. అంబేద్కర్ దళితుల అభ్యున్నతికి కృషిచేస్తే, మోడీ మనుధర్మ వ్యవస్థను ప్రొత్సహిస్తున్నారని విమర్శించారు.