ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం… ప్రభుత్వ వైద్యులకు షాక్…
ఏపీ మంత్రిమండలి సమావేశం గురువారం రోజున వెలగపూడిలోని సచివాలంలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నది. ముఖ్యంగా ప్రభుత్వ వైద్యుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
ప్రభుత్వ వైద్యులు సర్కార్ ఆసుపత్రుల్లో కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా పెద్ద ఎత్తున ప్రాక్టీస్ చేస్తుంటారు. దీనిపై దృష్టిపెట్టిన సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు ప్రైవేటు ప్రాక్టీస్ చేయకుండా నిషేధం విధిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. దీనిపై నియమనిబంధనలు రూపొందించాలని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వం నాడు నేడు పథకం కింద కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా సర్కార్ ఆసుపత్రులను ఆధునీకరించారు. అంతేకాకుండా, మౌళిక వసతులు, సదుపాయాలు, వైద్యులు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బందిని పెద్ద ఎత్తున నియమించింది. నాణ్యమైన మెడిసిన్‌ను కూడా ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. అయినప్పటికీ ప్రభుత్వ వైద్యులు ప్రైవేటుగా ప్రాక్టీస్ చేస్తూ అక్కడే మెరుగైన సేవలు అందిస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.