Anand Mahindra Key Comments on Satyam Ramalinga Raju: కుంభకోణానికి ముందే రామలింగరాజును కలిశాను
Anand Mahindra Key Comments on Satyam Ramalinga Raju: సత్యం రామలింగరాజు పై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. సత్యం రామలింగరాజుకు చెందిన సత్యం కంప్యూటర్ సర్వీసెస్‌ను మహీంద్రా గ్రూప్‌లో విలీనం చేసుకునే ప్రతిపాదనతో కుంభకోణం విషయం బయటపడటానికి ఏదాడి ముందుగానే ఆయన్ను కలిశానని అన్నారు. కానీ, తన ప్రతిపాదనకు ఆయన నుండి ఎలాంటి స్పందన రాలేదని అన్నారు. కంపెనీలో జరిగిన పొరపాట్లపై తనకు ముందుగానే తెలిసి స్పందించలేదేమోనని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. కాగా, ఆ తరువాత ఏడాది సత్యం కంప్యూటర్స్‌లో అవకతవకలు బయటపడటంతో సత్యం రామలింగరాజు జైలుపాలయ్యారు.
ఆ తరువాత సత్యం కంప్యూటర్స్‌ను ఆనంద్ మహీంద్రా విలీనం చేసుకున్నారు. కాగా ఆనంద్ మహీంద్రా కంప్యూటర్స్ సంస్థ విజయపధంలో పయనిస్తున్నది. వేలాది మంది ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు ఐటీ కంపెనీలు భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తుండగా, ఆనంద్ మహీంద్రా ఐటీ సంస్థ ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటూ విజయపధంలో పయనిస్తున్నది. కొత్త కొత్త ఆర్డర్లతో కంపెనీ దూసుకెళ్తున్నది. దేశీయ మొదటి ఐదు కంపెనీల్లో ఆనంద్ మహీంద్రా ఐటీ సర్వీసెస్ కూడా ఒకటిగా నిలవడం విశేషం.