పార్టీ మారటం లేదన్న కోమటి రెడ్డి
Komatireddy Rajagopal : తాను పార్టీ (Party) మారుతున్నట్టు వస్తున్న వార్తలను కోమటిరెడ్డి రాజగోపాల్ (Komati Reddy Rajgopal Reddy) ఖండించారు. తెలంగాణ (Telangan)లో మరో ఆరు నెలల్లో ఎన్నికలు ఉన్నందున దుష్ప్రచారాలతో బీజేపీ (BJP)ను బలహీనం చేసే కుట్రలు చేస్తున్నారని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. తాను కాంగ్రెస్ (Congress)లో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఆ వార్తలను నమ్మొద్దని. బీజేపీ (Bjp)లోనే తాను కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కొంత మంది కాంగ్రెస్ నేతలు తనను సంప్రదించిన మాట వాస్తవమని చెప్పారు.
రేవంత్ బ్లాక్‌మెయిలర్
రేవంత్ రెడ్డి (Reventh) బ్లాక్మెయిల్ చేసి కోట్లు సంపాదించారని కోమటిరెడ్డి ఆరోపించారు. రేవంత్ 20 ఏళ్లు తెలుగుదేశం (Tdp)లో ఉండి కాంగ్రెస్ (Congress)లోకి వచ్చారని, తాము ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్‌లోనే ఉన్నవాళ్లమని గుర్తు చేశారు. ఈ మధ్యే వచ్చిన రేవంత్ నాయకత్వంలో ఎలా పనిచేయటం కరెక్ట్ కాదని అన్నారాయన. తాను డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదని, పోరాడే వ్యక్తినని తెలిపారు. తప్పుడు ప్రచారాలతో మునుగోడు ఉప ఎన్నికలో ఓడించారని, కేసీఆర్‌ను గద్దె దింపేందుకే బీజేపీలో చేరారనని స్పష్టం చేశారు.
కర్ణాటకలో గెలిస్తే తెలంగాణలో గెలిచినట్టేనా
కర్ణాటకలో గెలిస్తే తెలంగాణలో గెలిచినట్టు కాదని అక్కడికీ, ఇక్కడికీ చాలా తేడా ఉందని రాజ్‌గోపాల్ స్పష్టం చేశారు. , రెవంత్, ఉత్తమ్, జానా, భట్టి ఇలా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నాలుగు గ్రూపులు తయారయ్యాయని విమర్శించారు. కేంద్రంలో అధికారంలోలేకుండా బలమైన నాయకత్వం లేకుండా తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించటం సలువు కాదని వివరించారు.
పదవులొద్దు.. బీజేపీ గెలుపే ముఖ్యం
బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ కొనసాగుతారని, అధ్యక్ష పదవి కోసం ఎలాంటి లాబీయింగ్లూ లేవని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తనకేమీ పదవులు వద్దని, తెలంగాణలో బీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయమని జనం నమ్ముతున్నారని అన్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం ఢిల్లీ పెద్దలతో తాను మాట్లాడుతన్నానని వివరించారు.