లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ, రెజ్లర్లు చేస్తున్న ఆందోళన తీవ్రమవుతోంది.
Wrestlers Protest: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ, రెజ్లర్లు చేస్తున్న ఆందోళన తీవ్రమవుతోంది. ఆదివారం రెజ్లర్లు కీలక ప్రకటన చేశారు. సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, వినేష్ ఫోగట్ మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు. 22 రోజులైంది.. ఇప్పటి వరకు బీజేపీ నుంచి ఎవరూ తమ వద్దకు రాలేదని వివరించారు. బీజేపీ మహిళా ఎంపీల సాయం కోరుతూ లేఖ రాస్తామన్నారు. ఆ లేఖను వారి ఇళ్లకు అందజేస్తామని చెప్పారు. సమాజంలోని ప్రజలందరి మద్దతు అవసరం అని స్పష్టం చేశారు. తాము చేస్తున్న ఆరోపణలు నిజమేనని.. అందుకే అందరూ మద్దతుగా రావాలని కోరారు. నేడు ప్రజలంతా తమ తమ జిల్లా కేంద్రాలకు వెళ్లి.. మెమోరాండం ఇవ్వాలని వినేష్ ఫోగట్ విజ్ఞప్తి చేశారు.
డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లు తమ సమస్యను ప్రపంచ ఒలింపియన్ల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. తమ సమస్యను అంతర్జాతీయ ఒలింపియన్లకు వివరిస్తూ లేఖలు రాస్తామని, వారి మద్దతు కోరతామని సోమవారం రెజ్లర్ వినేశ్ ఫోగట్ ప్రకటించారు. ఆందోళన ప్రతి ఒక్కరి వద్దకు చేరాలని, ఇది దేశంలోని మహిళల కోసం జరుగుతున్న పోరాటమని ఆమె పేర్కొన్నారు. మాకు మద్దతు ఇవ్వాలనుకునేవారు..9053903100 నెంబరుకు మిస్డ్ కాల్ ఇచ్చి మద్దతు తెలపాలని ఆమె కోరారు. కాగా, రెజ్లర్ల ఆందోళన నేటికీ 24 రోజులకు చేరుకుంది.
అధికార బీజేపీకి చెందిన ఏ నాయకుడు కూడా భారత రెజ్లర్లకు మద్దతుగా ముందుకు రాలేదు. దేశంలోని మహిళల భద్రత గురించి వారు మాట్లాడుతూ.. తాము కూడా వారి బిడ్డలమే.. బీజేపీలోని మహిళా లీడర్లు, కేంద్ర ప్రభుత్వంలోని మహిళా ప్రజాప్రతినిధులు బయటకు వచ్చి తమకు మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు.