Collegium: జడ్జీల నియామకంపై కేంద్రం వివరణ… రెండ్రోజుల్లో క్లియరెన్స్
Collegium: సుప్రీంకోర్టు జడ్జీల నియామకంపై కేంద్రం దిగొచ్చింది. నియామకాల గడువు విషయమంలో కట్టుబడి ఉంటామని అటార్నీజనరల్ సుప్రీంకోర్టుకు తెలియజేశారు. కొలీజియం సిఫారసుల్లో 44 పేర్లకు రెండు మూడు రోజుల్లో క్లియరెన్స్ ఇస్తామని ఏజీ సుప్రీంకోర్టుకు తెలియజేశారు. జాప్యం జరగబోదని ఆయన హామీ ఇచ్చారు. ఇక, ఇప్పటి వరకు ఎందుకు జాప్యం చేశారో తెలియజేయాలని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము సిఫారసు చేసిన వాటిల్లో 22 మంది పేర్లను తిప్పి పంపారని, బదిలీల విషయంలోనూ జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా చేయడం వలన కేంద్రంపై తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని అన్నారు.
ఇక సుప్రీంకోర్టులో నియమించాల్సిన ఐదుగురు న్యాయమూర్తుల విషయంపై కూడా జస్టీస్ ఎస్‌కే కౌల్, జస్టీస్ అభయ్ లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై మరికొంత సమయం కావాలని ఏజీ సుప్రీంకోర్టును కోరారు. దేశవ్యాప్తంగా వివిధ కోర్టులకు సంబంధించి 104 మంది పేర్లను 44 మంది నియామకాలపై రెండు మూడు రోజుల్లో క్లియరెన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఏజీ కోర్టుకు తెలియజేయడంతో సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న రగడ కొంత మేర తగ్గే అవకాశాలు ఉన్నాయి.
జడ్జీల నియామకాలను ఆలస్యం చేసే కొలది కేంద్ర ప్రభుత్వం నిర్ణయాల్లో మూడో పక్షం జోక్యం ఉందేమో అనిపించేందుకు అవకాశం ఉంటుందని ధర్మాసనం అనుమానాలు వ్యక్తం చేసింది. సిఫారసు చేసిన పేర్లలో అభ్యంతరాలు ఉంటే కేంద్రం నేరుగా సుప్రీంకోర్టును సంప్రదించవచ్చని ధర్మాసనం తెలియజేసింది. ఆలస్యం చేయడం వలస పరిష్కరించాల్సిన కేసులు పెండింగ్‌లో పడిపోతాయని ధర్మాసనం తెలియజేసింది.