కర్ణాటక సీఎం ఎవరనే విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఢిల్లీలో వరుస భేటీలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కర్ణాటక వ్యవహారాల ఇన్చార్జ్ సుర్జేవాలాలు సీఎం రేసులో ఉన్న ఇద్దరి నేతలతో మంతనాలు జరిపారు. ఇద్దరు నేతలు సీఎం పదవిపై పట్టుబట్టడంతో ఏం చేయాలో తెలియక అగ్రనాయకులు తలలు బాదుకుంటున్నారు. తుది నిర్ణయానికి రాలేకపోతున్నారు.
Who will be the Next CM of Karnataka, suspense Continues
కర్ణాటక సీఎం ఎవరనే విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఢిల్లీలో వరుస భేటీలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కర్ణాటక వ్యవహారాల ఇన్చార్జ్ సుర్జేవాలాలు సీఎం రేసులో ఉన్న ఇద్దరి నేతలతో మంతనాలు జరిపారు. ఇద్దరు నేతలు సీఎం పదవిపై పట్టుబట్టడంతో ఏం చేయాలో తెలియక అగ్రనాయకులు తలలు బాదుకుంటున్నారు. తుది నిర్ణయానికి రాలేకపోతున్నారు.
సీఎం పదవితో పాటు డిప్యూటీ సీఎం పదవికి కూడా తీవ్ర పోటీ నెలకొంది. అదే విధంగా మంత్రి వర్గంలో స్థానాలకు కూడా తీవ్ర పోటీ నెలకొంది. దీంతో పదవుల పంపకం కాంగ్రెస్ అగ్రనాయకులకు పెద్ద తలనొప్పిగా మారింది.
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిసిన శివకుమార్ దాదాపుగా రెండు గంటల పాటు చర్చలు జరిపారు. సీఎం పదవి తప్పితే తనకే పదవి వద్దని స్పష్టంగా తేల్చి చెప్పారు.
కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ పదవిలో ఉన్న శివకుమార్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటు తన వర్గానికి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలకు కీలక మంత్రి పదవులు ఇస్తామని ఖర్గే చూసించినట్లు తెలుస్తోంది. ఈ ఆఫర్‌ను కూడా శివకుమార్ సున్నితంగా తిరస్కరించారు. కనీసం మొదటి రెండేళ్లపాటైనా తనను సీఎం పదవిలో కొనసాగేలా చూడాలని శివకుమార్ గట్టిగా పట్టుబడుతున్నారు.
ఖర్గేను కలిసి చర్చలు జరిపిన శివకుమార్ అనంతరం రణదీప్ సుర్జేవాలా ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయనతో ప్రత్యేకంగా సమావేశమై తన వాదనను వినిపిస్తున్నారు.
మరోవైపు కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరూ ఢిల్లీ చేరుకున్నారు. వీరిందరితోను రేపు ప్రత్యేకంగా మరోసారి సమావేశం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరిని కలిసిన అనంతరం సీఎం అభ్యర్ధిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు కర్ణాటకలో పరిస్థితులు అదుపుతప్పకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇరువర్గాల నేతలకు చెందిన అనుచరులు వీరంగం సృష్టించకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు పోలీసులు సంసిద్ధంగా ఉన్నారు.