Himachal Pradesh: క్యాబినెట్ విస్తరణ.. మంత్రులుగా ఏడుగురు ఎమ్మెల్యేలు!
Himachal Pradesh cabinet expansion: హిమాచల్ ప్రదేశ్‌లోని సుఖ్‌విందర్ సుఖు ప్రభుత్వంలో ఏడుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం సిమ్లా రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. చీఫ్ సెక్రటరీ ప్రబోధ్ సక్సేనా కార్యక్రమాన్ని దగ్గరుండి నిర్వహించారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఏడుగురు ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు. ఇక ముందు ధని రామ్ షాండిల్ మంత్రిగా ప్రమాణం చేశారు. దీని తర్వాత చంద్ర కుమార్ రెండో స్థానంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మూడో స్థానంలో హర్షవర్ధన్ చౌహాన్, నాలుగో స్థానంలో జగత్ సింగ్ నేగి మంత్రిగా ప్రమాణం చేశారు. ఐదో స్థానంలో రోహిత్ ఠాకూర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
అనిరుధ్ సింగ్ ఆరో స్థానంలో, విక్రమాదిత్య సింగ్ ఏడో స్థానంలో ప్రమాణ స్వీకారం చేశారు. నిజానికి అంతకుముందు, ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ఆదివారం ఆరుగురు ప్రధాన పార్లమెంటరీ కార్యదర్శులతో పదవీ ప్రమాణం అత్యంత గోప్యత పాటిస్తూ ప్రమాణం చేయించారు. సుందర్ సింగ్ ఠాకూర్, మోహన్ లాల్ బ్రాక్తా, రామ్ కుమార్ చౌదరి, ఆశిష్ బుటైల్, కిషోరి లాల్, సంజయ్ అవస్తీ ప్రధాన పార్లమెంటరీ కార్యదర్శులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ముఖేష్ అగ్నిహోత్రి, ముఖ్యమంత్రి రాజకీయ సలహాదారు సునీల్ శర్మ, ముఖ్యమంత్రి మీడియా ప్రిన్సిపల్ అడ్వైజర్ నరేష్ చౌహాన్, ప్రధాన కార్యదర్శి ప్రబోధ్ సక్సేనా, ఇతర సీనియర్ అధికారులు, కొత్తగా నియమితులైన ప్రమంత్రుల కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.