Vehicle Scrappage Policy: 15 ఏళ్లు దాటితే… తుక్కే…
Vehicle Scrappage Policy: గతేడాది కేంద్ర ప్రభుత్వం కొత్త వాహన చట్టాలను తీసుకొచ్చింది. ఈ చట్టాల ప్రకారం 15 ఏళ్లు దాటిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లను ఉపసంహరించుకొని వాటిని తుక్కుకింగ పరిగణిస్తారు. 15 ఏళ్లు దాటిన వాహనాలను ప్రభుత్వం నిర్దేశించిన గ్యారేజీలకు పంపించాల్సి ఉంటుంది. వాటిని అక్కడ తుక్కుకింద మారుస్తారు. అయితే, సైన్యం, భద్రత, అంతర్గత భద్రత విషయంలో వెసులుబాటు కల్పించింది. ఇక, సామాన్య ప్రజలు వ్యక్తిగత అవసరాలకు కోసం వినియోగిస్తున్న వాహనాలను 20 ఏళ్ల తరువాత తప్పనిసరిగా సామర్థ్య పరీక్షలు చేయించాల్సి ఉంటుంది.
వాణిజ్య వాహనాలకు 15 ఏళ్ల సమయం ఉంటుంది. గతేడాది తీసుకొచ్చిన ఈ పాలసీ ఈ ఏడాది ఏప్రిల్ 1 వ తేదీ నుండి అమలులోకి రానున్నది. అమలులోకి వచ్చిన తరువాత పాత వాహనాలను తప్పనిసరిగా తుక్కు కేంద్రానికి పంపిచాల్సి ఉంటుంది. అయితే, పాత వాహనాన్ని తుక్కు కేంద్రానికి పంపిన అనంతరం, కొత్త వాహనం కొనుగోలు చేస్తే, రోడ్ ట్యాక్స్‌లో 25 శాతం వరకు రాయితీ ఇవ్వాలని ఇప్పటికే కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇక ప్రతి 150 కిమీ ఒక తుక్కు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కూడా కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.