Vandebharat Women Loco Pilot: శభాష్ సురేఖ… ఐదు నిమిషాలు ముందుగానే గమ్యస్థానానికి
Vandebharat Women Loco Pilot: దేశంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. దేశంలో అత్యంత వేగంగా పరుగులు తీసే రైళ్ల జాబితాలో ఈ రైళ్లు ఉన్నాయి. గంటకు 160 కిమీ వేగంతో పరుగులు తీసే ఈ రైళ్లకు ఆదరణ పెరుగుతున్నది. తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణం చేసే రైళ్లుగా ఇవి ఖ్యాతిగాంచాయి. అయితే, ఈ రైళ్లలో ఇప్పటి వరకు మగవారే లోకోపైలట్‌లుగా వ్యవహరించగా, తాజాగా, వందేభారత్ రైలును నడిపిన మహిళా లోకోపైలట్ గా సురేఖ యాదవ్ నిలిచారు. సోమవారం రోజున సోలాపూర్ స్టేషన్ నుండి సురేఖ యాదవ్ చత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినల్ వరకు దాదాపు 450 కిమీ దూరం వందేభారత్ రైలును నడిపారు.
వందేభారత్ రైలును నడిపిన తొలి మహిళా లోకో పైలట్‌గా చరిత్ర సృష్టించారు. గమ్యస్థానానికి చేరుకోవలసిన సమయం కంటే ఐదు నిమిషాల ముందే ఈ రైలు గమ్యస్థానానికి చేరుకోవడం విశేషం. అంతేకాదు, 1988 వ సంవత్సరంలోనే ఆమె మొదటిసారి లోకోపైలట్‌గా రైలును నడిపి చరిత్ర సృష్టించారు. దేశంలోనే కాకుండా, ఆసియాలోనే మొదటి మహిళా లోకో డ్రైవర్‌గా, పలు రాష్ట్రీయ, జాతీయ స్థాయిలో పురస్కారాలను అందుకున్నారు. మహిళలు ఏ రంగంలోనూ పురుషులతో తీసిపోరని, మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా చెప్పవచ్చు.