Vande Bharat: ప్రస్తుతం రైల్వేలో వందేభారత్ యుగం నడుస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో రెండు వందేభారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు ఒక రైలు నడుస్తుంటే.. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి మరో వందేభారత్ పరుగులు పెడుతోంది. తాజాగా మరో (మూడోది) వందేభారత్ ఏపీ మీదుగా సిద్దం అవుతోందని తెలుస్తోంది. జగన్నాధుడి రధ యాత్ర వేళ ఈ రైలు ప్రారంభంతో ఈ నిర్ణయం వ్యూహాత్మకంగా తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ రైలు అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర నుంచి ఒడిశా మధ్య మరింత కనెక్టివిటీ పెరగనుంది.
వందేభారత్ మేకిన్ ఇండియా ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు. ఇప్పుడు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్ధన మేరకు కొత్తగా మూడు వందేభారత్ లపై ప్రతిపాదనలు సిద్దం అవుతున్నాయి. ఇదే సమయంలో హౌరా నుంచి పూరీకి ఆరున్నార గంటల్లో చేరుకొనేలా వందేభారత్ ప్రారంభమైంది. మరో రెండు రైళ్ల ఏర్పాటు పైన వేగంగా కసరత్తు కొనసాగుతోందది. ఈ సమయంలోనే విశాఖ నుంచి భువనేశ్వర్, అదే విధంగా భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ మధ్య ఒడిశా ప్రభుత్వం కొత్త రైళ్లు ఏర్పాటు చేయాలని కోరింది. ప్రస్తుతం విశాఖ నుంచి భువనేశ్వర్ వరకు వందేభారత్ ఏర్పాటు పైన ట్రయిల్ రన్ కూడా చేసినట్లు తెలుస్తోంది.
తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాసకు వందేభారత్ వచ్చిందది. తాజా ప్రతిపాదనల్లో భాగంగా భువనేశ్వర్ నుంచి ఏపీకి వందేభారత్ ఏర్పాటులో భాగంగా నిర్వహించిన ట్రయిల్ రన్ గా తెలుస్తోంది. దీని పైన స్థానికంగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఒడిశా నుంచి ఏపీకి వందేభారత్ ఏర్పాటులో భాగంగా ట్రయల్ రన్ నిర్వహించినట్లు సమాచారం. ఇప్పటికే హైదరాబాద్ – బెంగుళూరు కొత్త వందేభారత్ రైలు ఏర్పాటు పైన ఇప్పటికే సర్వే పూర్తి చేసారు. దాదాపుగా రూటు విషయం లోనూ నిర్ణయానికి వచ్చారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఉన్న రద్దీని తట్టుకొనేందుకు ఈ రైలు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. వచ్చే నెలలో ఈ రైలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
ఒడిశా ప్రభుత్వం చేసిన ప్రతిపాదనల్లో పూరీ-హౌరా, పూరీ-రూర్కేలా, హైదరాబాద్ – భువనేశ్వర్ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి భువనేశ్వర్ లైన్ కు ఉన్న డిమాండ్ తో దీనిని రైల్వే అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ దూరం ఎక్కువగా ఉండటంతో విశాఖ నుంచి నడిపేలా తాజా ప్రతిపాదనలు సిద్దం అయ్యాయి. ఇప్పటి వరకు సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్లే రైళ్లు, సికింద్రాబాద్ టు భువనేశ్వర్ రైళ్లల్లో నిత్యం భారీగా వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. విశాఖ వరకు ప్రస్తుతం వందేభారత్ అందుబాటులో ఉండటంతో అక్కడి నుంచి ఒడిశా రాజధానికి వందేభారత్ ఖాయమని సమాచారం. ఇదే సమయంలో పూరీ జగన్నాధుడి రధయాత్ర జూన్ లో జరగనుంది.
దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పూరీకి భక్తులు తరలి వస్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయంగానే అన్ని నిర్ణయాలు తీసుకుంటుందనే అభిప్రాయం ఉంది. ప్రస్తుతం ఒడిశా నుంచి ఉత్తరాంధ్ర కు రాక పోకల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆ లైన్ లో నిత్యం ప్రయాణీకుల రద్దీ తో రైళ్లన్నీ ఫుల్ అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా భువనేశ్వర్ నుంచి హౌరా వరకు అందుబాటులోకి రావటంతో ఇటు ఏపీకి కూడా మరో రైలు సిద్దం చేస్తున్నారని సమాచారం. దీని పైన రైల్వే అధికారులు పూర్తి కసరత్తు తరువాత అధికారికంగా నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది.