US Intelligence Report: ఆ విషయంలో పాక్ జాగ్రత్తగా ఉండాలి… భారత్ జోలికొస్తే
US Intelligence Report: అమెరికా ఇంటిలిజెన్స్ సంస్థ ప్రపంచంలోని అనేక విషయాలకు సంబంధించిన కీలక రిపోర్ట్‌ను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ రిపోర్ట్‌లో భారత్, పాక్ కు సంబంధించిన విషయాలను కీలకంగా పేర్కొన్నారు. ఒకవేళ పాకిస్తాన్ భారత్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడితే మోడీ నాయకత్వంలోని భారత్ సైనిక శక్తితో సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉందని అమెరికా ఇంటిలిజెన్స్ సంస్థ తెలియజేసింది. గతంలో మాదిరిగా భారత్ చూస్తూ ఊరుకునే అవకాశం లేదని, ఈసారి పాక్ ఏమాత్రం తోక జాడించినట్లు అనుమానం వచ్చినా భారత్ తన ప్రతాపం చూపుతుందని ఇంటిలిజెన్స్ రిపోర్ట్ పేర్కొన్నది.
భారత ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తరువాత రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నించారని, ఆఫ్ఘనిస్తాన్ పర్యటన నుండి నేరుగా పాక్ వెళ్లి అందర్నీ మోడీ ఆశ్చర్యపరిచారని, ఆ తరువాత పాక్ ఉగ్రవాద సంస్థలు పఠాన్‌కోట్, యూరి, పుల్వామా దాడులు చేయడం, భారత్ సీక్రెట్ మిలటరీ ఆపరేషన్‌తో పాక్ ఉగ్రవాదులను ఏరివేయడం జరిగిందని, అప్పటి నుండి రెండు దేశాల సరిహద్దుల వద్ద ఉద్రిక్తలు నెలకొన్నాయని ఇంటిలిజెన్స్ రిపోర్ట్ పేర్కొన్నది. ఈ సమయంలో పాక్ తోక జాడిస్తే ఆ దేశానికి భారత్ బుద్ధి చెప్పడం ఖాయమని అమెరికా ఇంటిలిజెన్స్ రిపోర్ట్ పేర్కొన్నది.