UP Constable leave letter goes trending: నా భార్య అలిగింది… సెలవు ఇవ్వండి
UP Constable leave letter goes trending: ఉత్తరప్రదేశ్‌లో ఓ కానిస్టేబుల్ లీవ్ కావాలంటూ పై అధికారులకు రాసిన లేఖ వైరల్‌గా మారింది. తనకు నెల రోజుల క్రితమే వివాహం జరిగిందని, కానీ, విధుల రిత్యా ఇంటికి వెళ్లలేకపోయానని, దీంతో తన భార్య అలిగిందని, ఇంటికి ఫోన్ చేసినా తీయడం లేదని లీవ్ లేటర్‌లో పేర్కొన్నాడు. తన బాధను అర్ధం చేసుకొని లీవ్ ఇవ్వాలని కోరాడు. భార్యను ఓదార్చి విషయాలను కూలంకుషంగా వివరించాలని దానికి తగిన సమయం కావాలని, దీనికోసమే తాను లీవ్ అడుగుతున్నట్లు కానిస్టేబుల్ లేఖలో పేర్కొన్నాడు. ఇక వివరాల్లోకి వెళ్తే…
మౌ జిల్లాకు చెందిన గౌరవ్ చౌదరి అనే కానిస్టేబుల్ మహరాజ్ గంజ్ జిల్లాలోని నౌత్వానా పోలిస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గతేడాది డిసెంబర్ నెలలో గౌరవ్ వివాహం చేసుకున్నాడు. అయితే, వివాహం జరిగిన తరువాత తిరిగి విధుల్లో చేరవలసి వచ్చింది. వివాహం జరిగిన కొన్ని రోజులకే గౌరవ్ విధుల్లో చేరడంతో భార్యకు కోపం వచ్చింది. దీంతో ఆమె అలిగింది. ఫోన్ చేసినా తీయకపోవడంతో కానిస్టేబుల్ గౌరవ్ కంగారు పడ్డాడు. వెంటనే తన భార్యను కలుసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ పై అధికారులకు లీవ్ లెటర్ రాశాడు. ఈ లీవ్ లెటర్ లోని అంశం కొత్తగా ఉండటంతో స్థానికంగా ఈ లెటర్ వైరల్‌గా మారింది.