Spicejet Passenger: విమానంలో ప్రయాణికుడి వికృత చేష్టలు..దించేసిన అధికారులు
Spicejet Passenger: ఆమధ్య ఎయిర్ ఇండియా విమానంలో వృద్ధురాలిపై మూత్రవిసర్జన చేసాడనే విషయం మరువకముందే.. విమానంలో వికృతచేష్ఠలతో మరో వ్యక్తి వార్తల్లోకెక్కాడు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్తున్న స్పైస్‌జెట్ విమానంలో ఎయిర్ హోస్టెస్‌తో అసభ్యంగా ప్రవర్తించిన ఓ ప్రబుద్దుడినిదించేశారు అధికారులు. విమానంలోని ఓ మహిళా ఉద్యోగితో ఓ పురుష ప్రయాణికుడు అనుచితంగా ప్రవర్తించాడన్న ఆరోపణతో విమానంలో వాగ్వాదం జరిగింది. విమాన సిబ్బంది, ప్రయాణికుల మధ్య వాదన చోటు చేసుకుంది.
ఎస్‍జీ-8133 ఢిల్లీ నుండి హైదరాబాద్ కి వెళుతున్న కొరెండోన్ విమానం.. ఢిల్లీలో బయలు దేరే సమయంలో ఓ ప్రయాణికుడు క్యాబిన్ సిబ్బంది పట్ల అనుచితంగా, వికృతంగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని సిబ్బంది.. సెక్యూరిటీ స్టాఫ్‍కు ఫిర్యాదు చేశారు. ఆ ప్రయాణికుడిని అలాగే అతడికి తోడుగా వచ్చిన మరో వ్యక్తిని విమానం నుంచి దించామని అని స్పైస్‍జెట్ పేర్కొంది. అనంతరం వారిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుంది. విమానంలో ప్రయాణీకులు దురుసుగా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి