MBBS Students: ఢిల్లీలో ఉక్రెయిన్ ఎంబీబీఎస్ విద్యార్ధుల నిరాహార దీక్ష
ఉక్రెయిన్ నుంచి వచ్చిన ఎంబీబీఎస్ విద్యార్ధులు ఢిల్లీలో నిరాహార దీక్షకు దిగారు. తనకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఉక్రెయిన్లో చదువుతున్న తామంతా భారతదేశానికి చెందిన పౌరులమేనని, యుద్ధం జరుగుతున్న సమయంలో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం అక్కడి వెళ్లలేని పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారతదేశంలోనే తమ చదువులు కొనసాగేలా చూడాలని వారంతా కోరుతున్నారు. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన దాదాపు 18 వేల మంది విద్యార్ధులు ప్రస్తుతం భారతదేశంలో ఉన్నారు.
ఉక్రెయిన్ నుంచి భారతదేశం తిరిగి వచ్చిన విద్యార్ధులను ఇక్కడ చదివించేందుకు ఎటువంటి సౌకర్యాలు చట్టంలో పొందుపరచలేదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. లోక్సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం ఈ విషయం స్పష్టం చేసింది.
ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్ధుల్లో 412 మందికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తమ కళాశాలల్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చేందుకు సిద్ధమయింది. ఈ నిర్ణయం తీసుకుని రెండు నెలలు గడుస్తోంది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ లోక్సభలో సమాధానమిచ్చారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన విద్యార్ధులను ఇక్కడ చేర్చుకునేందుకు అనుకూలమైన చట్టాలు లేవని స్పష్టం చేశారు. భారతదేశంలో వైద్యవిద్యను పర్యవేక్షించే నేషనల్ మెడికల్ కమిషన్ ఈ విషయంలో ఎటువంటి అనుమతులు జారీ చేయలేదని మంత్రి క్లారిటీ ఇచ్చారు.
గత కొంత కాలంగా భారతదేశంలోనే ఉన్న వైద్య విద్యార్ధులంతా మంత్రి లోక్సభలో ఇచ్చిన సమాధానంతో రోడ్డుమీదకు వచ్చారు. నిరాహార దీక్షకు దిగారు.
If there is no any provision in NMC to accommodate foreign MBBS Students in India, please make the proven. NMC is rule maker and breaker. This is not a sufficient reason to reject the case. Remember that Ukrain returned students are Victims. @PMOIndia @NMC_IND @barandbench pic.twitter.com/9sbOQx4xI8
— Umakanta Mahapatra (@UmakantaMahap12) July 22, 2022
Future of 20k+ ukraine return MBBS students are at risk! Hunger strike at Raamleela maidan! pic.twitter.com/KEusz22UX3
— miss_intoxicant_ (@MissIntoxicant) July 23, 2022