Election 2023 Results: ఈశాన్యంలో గెలుపెవరిది..
Election Results: ఈశాన్య భారతంలో ప్రజలు ఎవరి వైపో తేలిపోనుంది. మూడు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలి రౌండ్స్ లో త్రిపుర లో బీజేపీ ఆధిక్యత కొనసాగుతోంది. నాగాలాండ్ లో బీజేపీ- ఎన్‌పీపీ లీడ్ లో ఉంది. మేఘాలయ హంగ్ దిశగా ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేడు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. త్రిపురలో ఫిబ్రవరి 16న పోలింగ్ జరిగింది. మేఘాలయ, నాగాలాండ్‌లో 27న ఎన్నికలు ముగిశాయి. ఇక ఈ మూడు రాష్ట్రాల్లోనూ 60 చొప్పున అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. బాలెట్ కౌంటింగ్ ఉదయం 8 గంటలకు మొదలైంది. 8:30 నుంచి ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. ఇక మూడు రాష్ట్రాల్లో మ్యాజిక్ ఫిగర్ 31గా ఉంది. అంటే ఏదైనా పార్టీ అధికారంలోకి రావాలంటే 31 స్థానాల్లో విజయం సాధించాలి.
ప్రస్తుతం త్రిపురాలో బీజేపీ ప్రభుత్వం ఉండగా, మేఘాలయాలో నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) నాగాలాండ్‌లో నార్త్ ఈస్ట్ డెమొక్రటిక్ అలయన్స్‌లు ఉన్నాయి. ఇక మూడు రాష్ట్రాల ఫలితం నేడు తేలనుంది. ఓటరు నాడి వైపు తిరిగిందో ఈరోజు తేలిపోతుంది. నాగాలాండ్‌లో 59 స్థానాలకు ఎన్నికలు జరగ్గా..4 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్‌కు ఎన్నికల సంఘం ఆదేశించింది. బుధవారం ఈ స్టేషన్లలో రీపోలింగ్ జరిగింది. ఇక నాగాలాండ్‌లో ఎన్నికలు నిర్వహించిన 59 సీట్లకు 183 మంది పోటీ పడ్డారు. మేఘాలయలో 59 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. త్రిపురలో 259 మంది పోటీ పడ్డారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. త్రిపురలో బీజేపీ ఆధిపత్యం లోకి వస్తుందని. నాగాలాండ్‌లో ఎన్డీపీపీ- బీజేపీ కూటమికి మెజారిటీ వస్తుందని కాగా.. మేఘాలయ లో పరిస్థితులు మాత్రం తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. గా నేడు మధ్యాహ్నం లోపే ఈ ఫలితాలు వెలువడనున్నాయి.