కేసు విచారణలో పోలీసులు నివ్వెర పోయే అంశాలను వివరించారు.
Bhopal Hunt Case : మధ్యప్రదేశ్ (MP) భోపాల్ (Bhopal) కేంద్రంగా వెలుగులోకొచ్చిన ఉగ్రవాద సంస్థ హిజ్బ్ ఉత్ తెహరీర్ (hunt) కేసు (Case) విచారణ (Enquiry)లో సంచలన అంశాలు వెలుగులోకొస్తున్నాయి. ఈ కేసు విచారణలో పోలీసులు నివ్వెర పోయే అంశాలను వివరించారు. బీజేపీ (BJP) అగ్రనేతలే టార్గెట్ (target)గా ఉగ్రవాదులు పని చేశారని విచారణలో తేల్చారు.
బిర్యానీ, లడ్డు..
శిక్షణ సమయంలో బిర్యానీ, లడ్డు అనే పదాలు కోడ్ లాంగ్వేజ్లుగా పెట్టుకుని, టెలిగ్రామ్, వాట్సాప్ కేంద్రంగా సంభాషణలు జరిపారు. జూమ్ యాప్ లోను సమావేశాలు నిర్వహించినట్లు పోలీసులు నిర్ధారించారు. భూపాల్ కమల్ పార్టీ స్టేషన్ , మోతిలాల్ నెహ్రూ స్టేడియం వద్ద రెక్కీ నిందితులు నిర్వహించినట్లు గుర్తించారు. జీహాదీ సాహిత్యం, టెక్నికల్ పరికరాలు, స్వాధీనం చేసుకున్నారు. ఎంతమంది యువత హట్ లో జాయిన్ అయ్యారనే అంశంపై దర్యాప్తు కొనసాగుతుంది. బీజేపీ అగ్ర నేతలను టార్గెట్‌గా చేసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడి కావడంతో నిర్ఘాంతపోయారు.
ఎన్నికలకు ముందు విధ్వసం
ఎన్నికల ముందు విధ్వంసం సృష్టించేందుకు వ్యూహరచన చేసినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. నిందితులపై రెండు సంవత్సరాలుగా యాంటీ టెర్రస్కార్డ్ పోలీసులు నిఘా పెట్టారని వెల్లడించారు. పేలుడు పదార్థాలు కొనుగోలు చేసే సమయంలో నిందితులను అరెస్ట్ చేసిన ఎటిఎస్ అధికారులు తెలిపారు. నిందితులు విదేశాల నుండి వస్తున్న వాయిస్ మెసేజ్‌లను ఆధారంగా చేసుకొని ప్లాన్ అమలు చేయాలనుకున్నారని వెల్లడించారు. ఎక్కడ ఎలాంటి డిజిటల్ ఎవిడెన్స్ దొరకకుండా పక్కా ప్లాన్‌తో నిందితులు జాగ్రత్తపడ్డట్టుగా గుర్తించారు. పోలీసులకు పట్టుబడతామని యాసిర్ ముందే గ్రహించినట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ అడ్డాగా…
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌కు చెందిన యాసిర్ ఆదేశాల మేరకు సలీం హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. నిందితులు 18 నెలలుగా హైదరాబాద్ పాతబస్తీలో నివసిస్తున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో కొంతకాలంగా వీరి కార్యకలాపాలపై నిఘా పెట్టింది. నాలుగు రోజుల క్రితం మధ్యప్రదేశ్ ఏటీఎస్ బృందం హైదరాబాద్ వచ్చింది. నగరంలో హిజ్భ్ ఉత్ తహ్రీక్ సంస్థ కార్యకలాపాలను వివరించారు. ఏటీఎస్, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఉగ్రవాద గ్రూపులు తమ ప్లాన్‌ను మూడు దశల్లో అమలు చేయాలని ప్లాన్ చేశాయి. ఇందుకోసం యూట్యూబ్ ఛానెల్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ యూట్యూబ్ ఛానెల్‌కు 3600 మంది సభ్యులు ఉన్నారు. మూడు రోజుల క్రితం మధ్యప్రదేశ్ ఏటీఎస్, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. మొత్తం 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో 11 మంది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు. మరో ఆరుగురు హైదరాబాద్‌కు చెందిన వారుగా గుర్తించారు.