TOll Rates Hike: వాహనదారులకు షాకిచ్చేందుకు సిద్దమైన సర్కార్!
TOll Rates Hike: ప్రభుత్వం మరోసారి వాహనదారులకు షాక్‌లు ఇవ్వడానికి సిద్ధమవుతోంది. దీంతో ఈసారి రోడ్లపై డ్రైవింగ్ మరింత ఖరీదైనది మారనున్నది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్ (PIU) ఎక్స్‌ప్రెస్‌వేలు సహా జాతీయ రహదారులపై టోల్ పన్నును పెంచడానికి సిద్ధమవుతోంది. అందుతున్న వివరాల ప్రకారం, ఏప్రిల్ 1 నుండి, NHAI టోల్ రేట్లను 5 నుండి 10 శాతం పెంచవచ్చు. అంటే, జాతీయ రహదారులు మరియు ఎక్స్‌ప్రెస్‌వే రహదారులపై డ్రైవింగ్ ఖరీదైనదిగా మారనున్నది. ప్రస్తుతం ఎక్స్ ప్రెస్ వేపై కిలోమీటరుకు రూ.2.19 చొప్పున టోల్ ట్యాక్స్ వసూలు చేస్తుండటం గమనార్హం. ఇప్పుడు దాన్ని 10 శాతం పెంచనున్నారు. సవరించిన టోల్ రేట్ల ప్రతిపాదన మార్చి 25 నాటికి అన్ని PIUల నుండి పంపబడుతుందని అంటున్నారు. రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన తర్వాత ఏప్రిల్ 1 నుంచి వీటిని అమలు చేసే అవకాశం ఉంది. కార్లు, తేలికపాటి వాహనాలపై టోల్ రేట్లు 5 శాతం, భారీ వాహనాలపై టోల్ ట్యాక్స్ 10 శాతం పెరగవచ్చని అంటునారు.