Dianosaurs Eggs Found at Narmada Valley: నర్మదా లోయలో డైనోసార్ గుడ్లు
Dianosaurs Eggs Found at Narmada Valley: మధ్యప్రదేశ్‌లోని నర్మదా లోయలో శాస్త్రవేత్తలు టైటానోసార్‌లకు చెందిన 256 గుడ్లను, ఎముకలను గుర్తించారు. ఈ ప్రాంతంలో శాస్త్రవేత్తలు తవ్వకాలు జరుపుతున్న సమయంలో ఈ శిలాజాలు బయటపడ్డాయి. అయితే గుడ్లు పెంకులపై పెంకులు ఉండటంతో పొదిగేందుకు అవకాశం లేకపోవడంతో వాటిని తల్లి డైనోసార్లు తన అండవాహికలలోనే ఉంచుకోవడంతో బహుళ పెంకులతో కూడిన గుడ్లు ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ శిలాజాలు 6.6 కోట్ల సంవత్సరాల క్రితం నాటివిగా పరిశోధకులు అంచనా వేస్తున్నారు. వీటికి సంబంధించిన వివరాలను పీఎల్ఓఎస్ ఒన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. వీటి నివాసాలు ఒకదానికొకటి దగ్గరలోనే ఉండటం విశేషమని పరిశోధకులు చెబుతున్నారు.
టైటానోసార్‌లు శాఖాహారులు. ఇవి చెట్ల ఆకులను, మొక్కలను ఆహారంగా తీసుకొని జీవిస్తాయి. సాధారణంగా ఇవి చాలా ఎత్తుగా బలంగా ఉన్నప్పటికీ మాంసాహార రాక్షసబల్లుల నుండి నిత్యం బెడద ఉంటుంది. వాటి నుండి తప్పించుకునేందుకు వాటిని ఎదుర్కొనేందుకు ఇవి సమూహాలుగా నివశిస్తుంటాయి. రూపం భయంకరంగా ఉన్నప్పటికీ, ఆహార అలవాట్ల దృష్ట్యా వాటి స్వభావం శాంతంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ స్థాయిలో దేశంలో డైనాసార్ల ఆనవాలు బయటపడటం ఇదే మొదటిసారి. ఈ శిలాజ గుడ్లపై శాస్త్రవేత్తలు ప్రస్తుతం పరిశోధను చేస్తున్నారు.