జాబిల్లిపై చంద్రయాన్-3 దిగిన ప్రదేశానికి శివశక్తి అని ప్రధాని మోడీ పేరు పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పేరు పెట్టడానికి గల కారణాలను మోడీ వెల్లడించారు.
PM Modi: జాబిల్లిపై చంద్రయాన్-3 (Chandrayaan-3) దిగిన ప్రదేశానికి ప్రధాని మోడీ (PM Modi) శివశక్తి (Shiva Shakthi) అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. గ్రీస్ దేశం నుంచి నేరుగా బెంగళూరుకు వెళ్లిన మోడీ.. అక్కడ ఇస్రో (ISRO) శాస్త్రవేత్తలతో సమావేశమై వారిని అభినందించారు. ఈ సందర్భంగా చంద్రయాన్-3 దిగిన ప్రదేశానికి శివశక్తి అనే పేరు పెడుతున్నట్లు ప్రకటించారు. తాజాగా ఆ ప్రదేశానికి శివశక్తి అని పేరు పెట్టడానికి గల కారణాలను మోడీ వెల్లడించారు.
శివ అనే పదాన్ని మన దేశంలో శుభంగా భావిస్తామని.. నారీ మణుల గురించి మాట్లాడే సమయంలో శక్తి పదాన్ని వాడుతామని మోడీ పేర్కొన్నారు. అందుకే చంద్రయాన్-3 చంద్రుడిపై దిగిన ప్రదేశానికి శివశక్తి అని పేరు పెట్టామని మోడీ స్పష్టం చేశారు. ఆ పేరు వెనుక ఉన్న ఉద్దేశం అదేనని వెల్లడించారు. మరోవైపు చంద్రయాన్-2 క్రాష్ ల్యాండ్ అయిన ప్రదేశానికి కూడా మోడీ పేరు పెట్టారు. ఆ ప్రదేశాన్ని తిరంగా పాయింట్ అని పిలుచుకుందామని పేర్కొన్నారు.
ఇకపోతే చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంతో మోడీ స్వయంగా వెళ్లి ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. పీణ్యలోని ఇస్రో కార్యలయానికి వెళ్లి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిపైనే కాకుండా.. చంద్రుడిపై కూడా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోందని మోడీ పేర్కొన్నారు. చంద్రయాన్-2 ఫెయిల్ కావడంతో వెనుకడుగు వేయలేదన్న మోడీ.. మరింత పట్టుదలతో పనిచేసి చంద్రయాన్-3 విజయం సాధించామని వెల్లడించారు. ఇది అసాధారణ విజయమని.. అంతరిక్ష చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించామని వెల్లడించారు.