Karnataka: బ్యూటీ పార్లర్ సిబ్బంది నిర్వాకంతో ఆగిన పెళ్లి
Karnataka: మరికొద్ది రోజుల్లో జరగాల్సిన పెళ్లి అత్తవారింట్లో భర్తతో అడుగుపెట్టాల్సిన ఆ అమ్మాయి ఆశలు అడియాశలయ్యాయి ..ఇదేదో కట్నం గురించో మరో విషయం మీద ఆగిన పెళ్లికాదు. ఓ బ్యూటీ పార్లర్ సిబ్బంది నిర్వాకంతో పెళ్లి ఆగిపోయింది. ఈ సంఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. హసన్ జిల్లాకు చెందిన ఓ యువతి కొద్దిరోజుల్లో పెళ్లిపీటలెక్కాల్సి వుంది. ఇటీవలే ఘనంగా నిశ్చితార్థం జరిగింది. పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. పెళ్లి ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. పెళ్లిలో అందంగా కనపించేందుకు యువతి ఓ బ్యూటీ పార్లర్ ను ఆశ్రయించింది. ఇదే ఆమె పాలిట శాపంగా మారి పెళ్లి ఆగిపోయే పరిస్థితి వచ్చింది.
పెళ్లిలో అందంగా కనపించేందుకు ఓ బ్యూటీ పార్లర్‌ను ఆశ్రయించింది. మేకప్‌లో భాగంగా యువతి ముఖానికి ఆవిరి పడుతుండగా బ్యూటీ పార్లర్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో ఆవిరి ఎక్కువై ఆ వేడికి యువతి ముఖమంతా వాచిపోయి అందవికారంగా తయారయ్యింది. ముఖమంతా నల్లగా మారి, కళ్లు, బుగ్గలు వాచిపోయి రూపం మొత్తం మారిపోయింది. కుటుంబసభ్యులు ఆమెను దగ్గర్లోని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అందవికారంగా తయారయిన యువతిని చూసి పెళ్లి చేసుకోవాల్సిన యువకుడు కంగుతున్నాడు. ఆ యువతిని పెళ్ళాడబోనని పెళ్లి నిలిపివేస్తున్నట్లు కుటుంబసభ్యులకు తెలిపాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు బ్యూటీ పార్లర్ యజమాని సిబ్బందిని విచారిస్తున్నారు.