రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా పద్మ పురస్కారాలు ప్రధానం
రాష్ట్రపతి భవన్‌లో రెండో విడత పద్మా పురస్కారాల కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 2022 సంవత్సరంలోని రెండో విడతలో వివిధ రంగాల్లో సేవలందించిన 73మందికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పద్మా పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.
యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్‌కు మరణానంతరం పద్మ విభూషణ్ పురస్కారం లభించింది. దీనిని కళ్యాణ్ సింగ్ కటుంబ సభ్యులకు అందజేశారు రాష్ట్రపతి. భారత్ బయోటెక్ ఛైర్మన్ కృష్ణ మూర్తి ఎల్లా, సుచిత్ర కృష్ణ ఎల్లాకు పద్మ భూషన్ పురస్కారం లభించింది. వీరితో పాటు కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్, ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్యా, క్రీడలు, పౌర సేవల విభాగాల్లో కృషి చేసిన వారికి రాష్ట్రపతి పురస్కారాలు అంజేశారు. ఈ సంవత్సరం నలుగురికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 107మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది కేంద్రం.