NIA: ముంబైలోకి ఉగ్రవాది సర్పరాజ్ మెమన్ ఎంటర్..ఎన్ఐఏ
NIA: ముంబై నగరంలోకి కరుడుగట్టిన ఉగ్రవాది సర్పరాజ్ మెమన్ చొరబడినట్లు ఎన్ఐఏ కు సమాచారం అందింది.మధ్యప్రదేశ్‌కు చెందిన సర్పరాజ్ మెమన్.. పాక్, చైనా, హాంకాంగ్‌లో శిక్షణ పొందినట్టు ఎన్ఐఏ తెలిపింది. హైస్పీడ్‌లో తన కదలికలను ట్రాక్ చేయాలని ముంబై పోలీసులకు ఎన్ఐఏ నుంచి మెయిల్ అందింది. లేదంటే ముంబై నగరంలో అతిపెద్ద విధ్వంసం జరగవచ్చని ఉన్నతాధికారులను హెచ్చరించింది. పక్క ప్రణాళిక తోనే సర్పరాజ్ ముంబైలోకి ఎంటర్ అయినట్లు సమాచారం.
ముంబై తోపాటు ఇండోర్ పోలీసులకు కూడా ఈ మెయిల్ అందింది. ఈ మెుయిల్ గురించి కూడా దర్యాప్తు సంస్థలు పరిశీలిస్తున్నాయి. పక్కదారి పట్టించేందుకు మెయిల్ పంపారా లేదా దర్యాప్తు సంస్థలకు సమాచారం ఇచ్చారా అనే కోణంలో కూడా అధికారులు విచారిస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో ముంబైలో ఉగ్రదాడి చేస్తామని బెదిరిస్తూ తనను తాలిబానీ సభ్యుడిగా పేర్కొంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఎన్‌ఐఏకు మెయిల్ వచ్చిందని పోలీసు వర్గాలు ఇంతకుముందే తెలిపాయి. ఈ క్రమంలోనే ఎన్ఐఏ సైతం మహారాష్ట్రలోని వివిధ నగరాలలో ఉన్న పోలీసులందరిని అలెర్ట్ చేసింది.
వాణిజ్య రాజధానిగా ఉన్న ముంబైని దెబ్బతీయాలని పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల సంస్థలను పెంచి పోషిస్తుందని ఉన్నతాధికారులు ఆరోపించారు. గత ఏడాది అక్టోబర్‌లో కూడా ఇదే విధంగా గతేడాది అక్టోబర్‌లో హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌కు బెదిరింపు కాల్ వచ్చింది. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆసుపత్రిని పేల్చేస్తానని బెదిరించాడు. ఈ తరుణంలో ఉన్నతాధికారులు అలెర్ట్ అయ్యారు.