తెలంగాణలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ అధిష్టానం అందుకు కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ బీజేపీ నేతలు హస్తిన బాట పడుతున్నారు.
BJP: తెలంగాణలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ అధిష్టానం అందుకు కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ బీజేపీ నేతలు హస్తిన బాట పడుతున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లడం పలు రకాల చర్చలకు దారి తీస్తోంది. ఎన్నికల ముందు కీలక పదవుల ప్రకటన ఉంటోదంటూ బీజేపీలో జోరుగా ప్రచారం వినిపిస్తోంది. రాష్ట్రనేతలమధ్య సఖ్యతలేదనిపిస్తుంది. మాజీ ఎంపీ పొంగులేటి నివాసానికి ఈటల వెళ్లిన సమయంలో ఈ విషయం తెలంగాణ అధ్యక్షుడు బండిసంజయ్ కి ఈ విషయం తెలియకపోవడం ..భేటీకి సంబంధించి తనకెలాంటి సమాచారం లేదన్న బండి సంజయ్ వ్యాఖ్యలు పార్టీలో నేతల మధ్య సఖ్యత లేదన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తరవాత తెలంగాణ బీజేపీలో అంతర్గతంగా ఏదో జరుగుతోందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ మూడు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసి కీలక నేతలతో సమావేశం అయ్యారు. అయితే ఈ విషయం చివరి వరకూ వెలుగులోకి రాలేదు. వెలుగులోకి వచ్చిన తర్వాత బీజేపీలో అంతర్గత రాజకీయం క్లైమాక్స్‌కు వచ్చిందన్న ప్రచారం ఆరంభమయింది. బండి సంజయ్‌ను కూడా హైకమాండ్ ఢిల్లీ పిలిపించిందన్న ప్రచారం ప్రారంభమయింది. అయితే బండి సంజయ్ మాత్రం తనకు ఢిల్లీ నుంచి ఎలాంటి పిలుపు రాలేదని స్పష్టం చేశారు.
త్వరలో పలువురు నాయకులకు కీలక పదవులకు అప్పగించే అవకాశం ఉంది. కర్ణాటక దెబ్బ తెలంగాణపై పడకుండా బీజేపీ అగ్రనాయకత్వం జాగ్రత్తలు పడ్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అవలంభించాల్సిన విధానాలపై పార్టీ బలోపేతంపై నేతల అభిప్రాయాలను సేకరించే పనిలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీలో ఉన్నారు. ఇప్పటికే ఈటల, రాజగోపాలరెడ్డి, వివేక్, కొండా విశ్వేశ్వరెడ్డి అభిప్రాయాలను అమిత్ షా, సునీల్ బన్సల్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక రెండు రోజులనుండి రాజగోపాలరెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నాడని ప్రచారం జరుగుతుంది..ఈనేపథ్యంలో తెలంగాణపై ఫోకస్ పెట్టింది బీజేపీ. బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడిగా ఉండటంపై ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన కొంత మంతి కీలక నేతలు అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం కొంత కాలంగాసాగుతోంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చాల్సిందేనని నేతలు పట్టుబడుతున్నారని గతంలోనూ ప్రచారం జరిగింది. పార్టీలో చేరినప్పుడు యాక్టివ్ గా కనిపించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. పార్టీకి, బండి సంజయ్ కి అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఈటల రాజేందర్, వివేక్ కూడా బండి సంజయ్ పై తీవ్ర అసహనంతో ఉన్నారని చెబుతున్నారు.
అధిష్టానం ఒకవేళ బండి సంజయ్ ని మార్చకపోతే సొంత పార్టీని కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో బీజేపీ అసంతృప్తి నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు సమయం కొద్ది నెలలు మాత్రమే ఉండడంతో, తెలంగాణ బిజెపిలో భారీగా ప్రక్షాళన చేపట్టకపోతే పార్టీ అధికారంలోకి రావడం కష్టమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కొంత మంది కీలక నేతలు బహిరంగంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీకి సంకట పరిస్థితులు నెలకొన్నాయని మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చెప్పారు. ఈ కారణంగానే జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి లాంటి నాయకుల చేరికలు ఆగిపోయాయని వెల్లడించారు. ప్రజలకు నమ్మకం కుదరాలంటే పార్టీ మరింత శ్రమించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో ఒక మీడియా చానెల్‌తో మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్ లాంటి శక్తిని ఎదుర్కోవాలంటే బీజేపీ వ్యవహారశైలిలో అనేక మార్పులు జరగాలని స్పష్టం చేశారు.
ఇప్పటికే సంజయ్ వ్యవహారంపై పార్టీ అధిష్టానం అసంతృప్తితో ఉందనే వార్తలు వస్తున్నాయి.ఇప్పుడు అసమ్మతి నేతలు ఆయనకు వ్యతిరేకంగా గళం విప్పడం , ఈటెల రాజేందర్ కు పార్టీ బాధ్యతలు అప్పగించాలనే ప్రచారం కూడా జరుగుతుంది. కర్ణాటక ఎన్నికల తర్వాత పరిస్థితిని మరింత లోతుగా అధ్యయనం చేస్తున్న బీజేపీ హైకమాండ్.. తెలంగాణ విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నరు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో బండి సంజయ్‌కు మినహా ఇతర నేతలకు ఎక్కడా ప్రాధాన్యం లభించడం లేదని.. సీనియర్లు అదిష్ఠానంముందువాపోతున్నారని సమాచారం. తెలంగాణ లో ఎన్నికలకు ఎక్కువసమయం కూడా లేదు..కాబట్టి ఇప్పటినుండే బీజేపీ అధిష్టానం తెలంగాణపై ఇక్కడఉన్న పరిస్థితులపై చర్చించుకుంటుంది. ఇక బీజేపీనేతలని ఢిల్లీకి పిలిపించుకుని సీరియస్ గా చర్చిస్తుంది.