Tarun chugh: బండి సంజయ్ కు అండగా..తరుణ్ చుగ్
Tarun chugh: ఎమ్మెల్సీ కవితపై బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ బిఆర్‌ఎస్ నేతలు భగ్గుమన్నారు. కవితపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యాలను నిరసిస్తూ రాజ్ భవన్ వద్ద జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నేతృత్వంలో కార్పోరేటర్లు, ప్రభుత్వ విప్ గొంగడి సునీత ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ మహిళ నేతలు నిరసన వ్యక్తం చేశారు. వెంటనే బండి సంజయ్ మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు.
బండి సంజయ్ పై పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదుల చేసారు.. కొన్నిచోట్ల ఎఫ్ఐఆర్ లు కూడా నమోదయ్యాయి.. తెలంగాణ మహిళ కమిషన్ సంజయ్ వ్యాఖ్యాలను సుమోటోగా తీసుకుని సంజాయిషీ ఇవ్వవలసిందిగా ఆదేశించింది.. ఢిల్లీలోని జాతీయ మహిళ కమిషన్లో సైతం బిఆర్ ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు..ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ మాత్రం సంజయ్ కు అండగా నిలిచారు.. బండి మాటలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.కాగా, లిక్కర్ స్కామ్ లో వందల కోట్ల అవినీతి జరిగిందని తరుణ్ చుగ్ ఆరోపించారు. దర్యాప్తు సంస్థలకు సోనియా గాంధీ అయినా, కేసీఆర్ అయిన ఒకటేనని అన్నారు. సొంతపార్టీ వారు పార్టీ లో ఉన్న మహిళలను దూషిస్తుంటే అవేమి పట్టించుకోరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.