CM Stalin: సీఎం స్టాలిన్ రెండు రోజుల మధురై పర్యటన
Tamil Nadu CM Stalin two day Madhurai tour
తమిళనాడు సీఎం స్టాలిన్ నేటి నుంచి రెండు రోజుల పాటు మదురైలో పర్యటించనున్నారు. దక్షిణాది జిల్లాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులతో పాటు వివిధ రకాల ప్రజా సంక్షేమ పథకాలపై సమీక్ష చేపట్టనున్నారు. మదురై, దిండిగల్, శివగంగై, రామనాథపురం, తేని జిల్లాల అభివృద్ధి పనులపై ఆయన సమీక్ష చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు మదురై జిల్లా కలెక్టరేట్‌లో సౌత్ జోన్ ఐజీ, మదురై కమిషనర్, డీఐజీలు, ఐదు జిల్లాల ఎస్పీలతో శాంతిభద్రతలపై సమీక్ష చేపడతారు. సాయంత్ర 5 గంటలకు కీళడిలో నిర్మించిన పురావస్తు శాఖ మ్యూజియం ప్రారంభం చేయనున్నారు.
టీఆర్ బాలకృష్ణను కలవనున్న సీఎం స్టాలిన్
మధురై పర్యటనకు వస్తున్న సీఎం స్టాలిన్ ఓ సీనియర్ సిటిజన్ ను కలవనున్నారు. టీఆర్ బాలకృష్ణన్ అనే 92 ఏళ్ల వృద్దుడు ఇటీవలే మధురై సెంట్రల్ జైలుకు 300 పుస్తకాలను దానం చేశారు. ఈ విషయం తెలిసిన సీఎం స్టాలిన్ ఓ ప్రత్యేక వీడియో ద్వారా గత నెలలో బాలకృష్ణన్ ను ప్రశంసించారు. ప్రస్తుతం మధురై పర్యటనలో ఉన్న సీఎం స్వయంగా ఆ వృద్ధుడిని కలవనున్నారు.
సెంట్రల్ జైలు లైబ్రరీకి లక్ష పుస్తకాలు]
సెంట్రల్ జైలు లైబ్రరీకి లక్ష పుస్తకాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగా వస్తున్న ఆదరణ పట్ల సీఎం స్టాలిన్ సంతోషం వ్యక్తం చేశారు. ఎమెర్జెన్సీ సమయంలో తాను జైలు పాలైన సందర్భంగా పుస్తకాలు చదివే అలవాటు అబ్బిందని గుర్తుచేసుకున్నారు. మరోవైపు సీఎం తనను స్వయంగా కలవడానికి వస్తున్నారని తెలిసి బాలకృష్ణన్ సంతోషం వ్యక్తం చేశారు. సెంట్రల్ జైలు అధికారులు సీఎంతో సమావేశానికి ఏర్పాట్లు చేశారు.