CM Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్ కు కరోనా.. ఆసుపత్రిలో చేరిక
Tamil Nadu CM Stalin Tests Positive For Covid: తమిళనాడు సీఎం స్టాలిన్ కరోనా బారిన పడ్డారు. కోవిడ్-19 నిర్ధారణ కావడంతో ఐసోలేషన్లోకి వెళ్లారు. మంగళవారం (జులై 12) ఉదయం కాస్త అలసటగా అనిపించిందని.. కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకోగా పాజిటివ్ అని తేలిందని ట్విటర్ ద్వారా ఆయనే స్వయంగా వెల్లడించారు. దీంతో హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్లు వెల్లడించారు. ‘అందరూ మాస్కులు ధరించండి. వ్యాక్సిన్ వేసుకోండి. సేఫ్గా ఉండండి’ అని స్టాలిన్ ట్వీట్ చేశారు.
ఇక నేడు ఆయన ఆరోగ్యం క్షీణించడంతో చెన్నైలో కావేరి ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని ఆసుపత్రి యాజమాన్యం ఒక ప్రకటన ద్వారా తెలిపింది. “తమిళనాడు సీఎం స్టాలిన్ కరోనా లక్షణాలతో కావేరి ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని మానిటర్ చేస్తున్నాం” అని తెలిపారు. ఇక సీఎం స్టాలిన్ త్వరగా కోలుకోవాలని తమిళనాడు ప్రజలు దేవుడిని ప్రార్థిస్తున్నారు.