తమిళనాడులోని నాగపట్టణం జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తెల్లకోటు ధరించలేదని హిజాబ్ ధరించిన మహిళా డాక్టర్ తో బీజేపీ నేత గొడవకు దిగారు. వివరాలోకివెళితే..తమిళనాడులోని నాగపట్టణం జిల్లా తిరుపుండికి చెందిన బీజేపీ కార్యకర్త భువనేశ్వర్ రామ్.. అనారోగ్యానికి గురైన సుబ్రమణియన్ అనే వ్యక్తిని చికిత్స కోసం పీహెచ్ సీకి మే 24వ తేదీన రాత్రి సమయంలో తీసుకెళ్లాడు.
Tamil Nadu: తమిళనాడులోని నాగపట్టణం జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తెల్లకోటు ధరించలేదని హిజాబ్ ధరించిన మహిళా డాక్టర్ తో బీజేపీ నేత గొడవకు దిగారు. వివరాలోకివెళితే..తమిళనాడులోని నాగపట్టణం జిల్లా తిరుపుండికి చెందిన బీజేపీ కార్యకర్త భువనేశ్వర్ రామ్.. అనారోగ్యానికి గురైన సుబ్రమణియన్ అనే వ్యక్తిని చికిత్స కోసం పీహెచ్ సీకి మే 24వ తేదీన రాత్రి సమయంలో తీసుకెళ్లాడు. ఆయనను పరిశీలించిన డాక్టర్ జన్నత్… రోగి పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే నాగపట్టణం ప్రభుత్వ ఆసుపత్రి కి తీసుకెళ్లాలని సూచించారు. అయితే భువనేష్ రామ్ ఇందుకు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘విధుల్లో వున్నప్పుడు హిజాబ్ ఎందుకు ధరించావు? అసలు నువ్వు డాక్టరేనని గ్యారెంటీ ఏంటి? హిజాబ్ తొలగిస్తావా లేదా?’ అంటూ డాక్టర్ తో వాగ్వివాదానికి దిగాడు.
డ్యూటీ డాక్టర్ ను కాపాడేందుకు వచ్చిన పీహెచ్ సీ నర్సింగ్ సిబ్బంది కూడా.. రామ్ ఆ డాక్టర్ తో గొడవ పడుతున్న వీడియోను రికార్డ్ చేసి తరువాత సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్ అయ్యింది. విషయాన్ని పక్కదోవ పట్టించేలా హిజాబ్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చి వివాదం చేశాడు. ఈ వ్యవహారం తెలియగానే సీపీఎం, డీపీఐ సహా పలు పార్టీల నేతలు అక్కడకు చేరుకొని వేలాంకన్ని-తూత్తుకుడి బీచ్ రోడ్డుపై భైఠాయించారు. భువనేష్రామ్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. భువనేశ్వర్ రామ్ పై ఐపీసీ సెక్షన్ 294 (బి), 353, 298 కింద మూడు కేసులు నమోదు చేశారు.
நாகையில் ஹிஜாப் அணிந்த பெண் மருத்துவருக்கு எதிர்ப்பு தெரிவித்த பாஜக நிர்வாகி மீது வழக்கு#BJP #Hijab #Tamilnadu pic.twitter.com/cyqhRUYMmQ
— Raj 😷 (@thisisRaj_) May 26, 2023