Vijay Mallya: విజయ్ మాల్యాకు సుప్రీం షాక్!
Vijay Mallya: పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు నుంచి ఈరోజు షాక్ తగిలింది . తనను పారిపోయిన ఆర్థిక నేరగాడిగా ప్రకటించి, తన ఆస్తులను జప్తు చేయడాన్ని ముంబై కోర్టులో సవాలు చేస్తూ మాల్యా చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ విషయంలో పిటిషనర్ నుండి తనకు ఎలాంటి సూచనలు అందడం లేదని మాల్యా తరపు న్యాయవాది సుప్రీం కోర్టుకు తెలిపారు, దీంతో సుప్రీం కోర్టు స్టే పిటిషన్‌ను కొట్టివేసింది. పిటిషనర్ ఎలాంటి ఆదేశాలు ఇవ్వడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టులో తెలిపారు. ఈ ప్రకటనను దృష్టిలో ఉంచుకుని, న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, రాజేష్ బిందాల్‌లతో కూడిన ధర్మాసనం నాన్ ప్రాసిక్యూషన్ పిటిషన్‌ను కొట్టివేసింది.
ప్రభుత్వం, ఆర్థిక సంస్థల చర్యలను సమర్థించింది. బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించకుండా విదేశాలకు వెళ్లడాన్ని ఏమంటారంటూ ప్రశ్నించింది. డబ్బును చెల్లిస్తామని, ఆస్తుల వేలం నిలిపివేయాలన్న మాల్యా తరపు లాయర్ వాదనను అంగీకరించలేదు సుప్రీంకోర్టు. కొత్త చట్టం ప్రకారం తనను పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించాలని ED చేసిన విజ్ఞప్తిపై ముంబైలోని ప్రత్యేక PMLA కోర్టు ముందు విచారణను నిలిపివేసిన బాంబే హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ మాల్యా 2018లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అతని పిటిషన్ తిరస్కరించబడింది. మాల్యా మార్చి 2016లో యునైటెడ్ కింగ్‌డమ్‌కు పారిపోయి రూ.9,000 కోట్ల డిఫాల్టర్ కేసును ఎదుర్కొంటున్నారు.