SC Orders on Mukesh Security: అంబానీ కుటుంబం భద్రతపై సుప్రీం కీలక ఆదేశాలు..
Supreme Court orders on Mukesh Ambani protection: ముఖేశ్ అంబానీ కుటుంబం భద్రతకు సంబంధించిన పిటిషన్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. అంబానీ కుటుంబానికి జెడ్ ప్లస్ కేటగిరి భద్రతను కల్పించాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. అంబానీ కుటుంబం దేశంలోనే కూడా విదేశాల్లోనూ పర్యటించే సమయంలో కూడా జెడ్ ప్లస్ సెక్యూరిటీని కల్పించాలని, సెక్యూరిటీ కల్పనకు అయ్యే ఖర్చులను ముఖేష్ అంబానీనే భరిస్తారని సుప్రీం తన ఆదేశాల్లో పేర్కొన్నది. అంబానీ కుటుంబ భద్రతకు సంబంధించి త్రిపుర రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన అత్యున్నత ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.
అంబానీ కుటుంబం పర్యటనపై కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. మహారాష్ట్ర లేదా దేశంలో ఆ కుటుంబం ఉన్న సమయంలో రాష్ట్ర, కేంద్ర హోంశాఖ భద్రతను పర్యవేక్షిస్తుందని, విదేశాల్లో పర్యటించే సమయంలో కేంద్ర హోంశాఖ పర్యవేక్షణ ఉండాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తన ఆదేశాల్లో పేర్కొన్నది. సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలతో అంబానీ కుటుంబాన్ని నిత్యం 58 మంది కమాండోలు, 10 మంది స్టాటిక్ గార్డ్‌లు, 24 మంది ఆర్మీ జవానులు నిత్యం కాపలాగా ఉండనున్నారు.