Supreme Court on Sena Vs Sena Case: మహారాష్ట్ర ప్రభుత్వ విశ్వాస పరీక్షపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
Supreme Court on Sena Vs Sena Case: మహారాష్ట్రలో మహా అఘాడీ ప్రభుత్వం కూలిపోవడంపై ఉద్ధవ్ ఠాక్రే సుప్రీంకోర్టులో కేసును దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఐదుగురు ధర్మాసనంతో కూడిన బెంచ్ విచారణ నిర్వహించింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం దీనిపై కీలక వ్యాఖ్యలు చేసింది. అధికార పార్టీలో విభేదాలు వచ్చినంత మాత్రాన గవర్నర్ ప్రభుత్వాన్ని ఏ విధంగా విశ్వాస పరీక్షకు పిలుస్తారని ప్రశ్నించింది. విబేధాలు రావడం వలన ప్రభుత్వం కూలిపోతుందని తెలిసి కూడా గవర్నర్ విశ్వాస పరీక్షకు పిలవడాన్ని తప్పుపట్టింది.
ఈ వ్యవహారంలో గవర్నర్ జోక్యం చేసుకోకుండా ఉంటే బాగుండేదని, మూడేళ్లు కలిసి కాపురం చేసిన సంకీర్ణ ప్రభుత్వంలోని 34 మంది శివసేన ఎమ్మెల్యేలు రాత్రికి రాత్రే ఎలా వ్యతిరేకమయ్యారని ప్రశ్నించింది. ఎన్నికల తరువాత ఇలాంటి అసమ్మతి వస్తుంటుందని, కానీ మూడేళ్ల తరువాత అసమ్మతి రాగం తీయడం విచిత్రంగా ఉందని సీజేఐ చంద్రచూడ్‌తో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం పేర్కొన్నది. శివసేన పార్టీకి చెందిన 34 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. 34 మంది ఎమ్మెల్యేలు బీజేపీ మద్దతుతో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. శివసేన తిరుగుబాటునేత ఏక్‌నాథ్ శిండే ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఇక, శివసేన పార్టీ, బాణం గుర్తును తిరుగుబాటు నేతకు కేటాయించింది.